కోహ్లీని దాటేసిన అజయ్ జడేజా ఆస్తి విలువెంతో తెలుసా ?
ప్రస్తుత టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీనే సంపన్న క్రికెటర్... కానీ కోహ్లీని కూడా దాటేశాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...అజయ్ జడేజా రాత్రికి రాత్రి అపర కుబేరుడైపోయాడు.

ప్రస్తుత టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీనే సంపన్న క్రికెటర్… కానీ కోహ్లీని కూడా దాటేశాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా…అజయ్ జడేజా రాత్రికి రాత్రి అపర కుబేరుడైపోయాడు. జామ్‌నగర్ రాజ సింహాసనాన్ని వారసత్వంగా పొందిన తరువాత భారతదేశపు అత్యంత ధనిక క్రికెటర్‌గా అవతరించాడు. జడేజా నికర విలువ 1,450 కోట్లు కాగా.. కోహ్లి నికర విలువ 1,090 కోట్లుగా ఉంది. ఇటీవల దసరా సందర్భంగా నవనగర్‌ను పాలిస్తున్న జామ్ సాహెబ్ మహారాజా తన వారసుడిగా అజయ్ జడేజాను ప్రకటించారు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అజయ్ జడేజా.. భారత్ జట్టు తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు.