KALKI 2898AD Movie : ఆకశాన్ని అంటిన KALKI 2898AD మూవీ టికెట్లు.. ఒక్కో టికెట్ రూ.2,300
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ KALKI 2898AD మూవీ కల్కి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో కల్కి మూవీ టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.

Akashani KALKI 2898AD Movie Tickets Rs.2,300 per ticket
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ KALKI 2898AD మూవీ కల్కి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో కల్కి మూవీ టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు ఓపెన్ అయ్యాయో లేదో క్షణాల్లో అమ్ముడయ్యాయి. ఈ సినీమా కోసం ఆంధ్ర, తెలంగాణలో కాదు యావత్ దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా ముంబైలో కల్కి మూవీ టికెట్లు ఆకాశాన్ని అంటాయి.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా ‘KALKI 2898AD’ మూవీ రిలీజ్ కానుంది. ముంబైలో ఈ సినిమా టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది. మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ రూ.1,760, రూ.1,560 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు.