Akkineni Akhil : అఖిల్ కు సర్జరీ నిజమేనా..?
అక్కినేని అఖిల్.. తెలుగు ఇండస్ట్రీలో యూత్ అందగాడు. నేచురల్ గ్లామర్ తో తో ముద్దుస్తోతాడు అంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మొహం కి సర్జరీ అంటే నమ్ముతారా.. ప్రస్తుతం ఈ వార్తలే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Akkineni Akhil is the youth hottie in Telugu industry Girls say he kisses with natural glamour Now do you believe that face surgery?
అక్కినేని అఖిల్.. తెలుగు ఇండస్ట్రీలో యూత్ అందగాడు. నేచురల్ గ్లామర్ తో తో ముద్దుస్తోతాడు అంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మొహం కి సర్జరీ అంటే నమ్ముతారా.. ప్రస్తుతం ఈ వార్తలే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగా హీరో అఖిల్ టైం అస్సలు బాగో లేదు. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్నా బాక్సాఫీస్ లో మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నాడు ఈ నేచురల్ అందగాడు. తెలుగు టాప్ డైరెక్టర్ వివి వినాయక్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు అఖిల్ సినిమాతో తెలుగు సినీ అరంగేట్రం చేశాడు. ఆ సినిమా అంతగా ప్రేక్షకులు అంత ఆదరించలేదు. తీసిన మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో అటు వివి వినాయక్.. ఇటు అఖిల్ చాలా నిరషయ్యారు. యాక్షన్ సినిమాలు వద్దని రొమాంటిక్ లవ్ జోనర్స్ ట్రై చేశాడు. అలా చేసిన మిస్టర్ మజ్ను, హలో చిత్రాలు కూడా నిరాశపరిచాయి. నాలుగో చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్ టాక్ తెచ్చుకోని మొదటి హిట్ కొట్టాడు ఈ మిల్కీ బాయ్. ఇలా హిట్టు కొటాడో లేదో మళ్లీ ఫ్లాప్ వెంటాడింది. అదే భారీ బడ్జెట్ తో తీసిన సుదీర్ రెడ్డి చిత్రం ఏజెంట్.
అఖిల్ కు సర్జరీనా.. ?
స్టార్ మీద సర్జరీ చేసుకోవడం.. వారుపై సర్జరీ వార్తలు రావడం పెద్ద విషయమేమీ కాదు.. సిని హీరోలకు ఇది చాలా సాధారణం. కాకుంటే అఖిల్ లాంటి యువ హీరో పై ఆ వార్త రావడం ఇప్పుడు హాట్ టాపిగ్ మారింది. గత రెండు రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో అఖిల్ కు సర్జరీ అనే వార్తలు అని తెగ వైరల్ అవుతున్నాయి. అసలే అఖిల్ టైమ్ సరిగ్గా నడవటం లేదు. ఈ సమయంలో ఇలాంటి వార్త అంటే ఫ్యాన్స్ లో ఒకింత ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు అఖిల్ అక్కినేని. ఏజెంట్ కోసం అఖిల్ చాలా కష్ట పడ్డాడు. ఈ సినిమా కోసం భారీ ష్టంట్ , యాక్షన్ సిన్స్ చేశాడు అక్కిల్. అయిన ఫలితం లేకపోగా బూడిదలో పోసిన పన్నీరులా అయింది. ఈ మూవీతో నిర్మాత కూడా బాగా నష్టపోయాడు. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. సైరా నరసింహారెడ్డి లాంటి భారీ పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి కు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఏజెంట్ ఫలితంతో నిరాశపడిన అఖిల్ నెక్స్ట్ సినిమాను ఎలా తీయాలి అని ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు.
అఖిల్ కు కాస్మోటిక్ సర్జరీ..?
అఖిల్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం. తన ముక్కుకు సంబంధించిన కొన్ని మెరుగులు దిద్దుతున్నారుట. దీనికోసం ఆయన విదేశాలకు వెళుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై చాలా మంది కౌంటర్ వేస్తున్నారు.. ముందు తర్వాత సినిమాకు స్క్రిప్టు మెరుగులు దిద్దుకుని హిట్ కొట్టక, ఈ ముక్కుకు, మొహాన్ని చెక్కడం ఎందుకు అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త ఆనోట ఈ నోట పడి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ అందగాడు..కాబట్టి కాస్మోటిక్ సర్జరీ వార్త ఫేక్ అంటున్నారు అఖిల్ వీరాభిమానులు.
S.SURESH