Akhil: అఖిల్ భయ్యా ఏమైపోయావ్.. నువ్వు ఎక్కడ
అఖిల్ కనిపించడం లేదు. ఒక్క సినిమా ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. అసలు ఏమైపోయాడు అని చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు.

Akkineni's next project is not announced after Akhil's agent flop
యంగ్ హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఈ విషయంలో ఓ స్టార్ కిడ్ మాత్రం వెనకబడిపోయాడు. లాస్ట్ మూవీ వచ్చి ఆరు నెలలు దాటిన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం లేదు.
అఖిల్ అక్కినేని..ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అకౌంట్ లో వేసుకున్న హీరో. ఈ సినిమా కోసం అతను పడ్డ కష్టం అంతా వృథా అయ్యింది. అలాగే నిర్మాత అనిల్ సుంకర కూడా ఏజెంట్ తో బాగా నష్టపోయాడు. సురేందర్ రెడ్డి మాత్రం ఏజెంట్ ఆలోచనల నుంచి బయటకొచ్చి పవన్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు.ఇంత వరకు ఓకే.. కానీ మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న అఖిల్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఫై ఫోకస్ పెంచాడు.సాహోకి అసిస్టెంట్ గా వర్క్ చేసిన అనిల్ తో ఓ పీరియాడిక్ డ్రామ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది.
నిజానికి శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి అఖిల్ తో ఒక సినిమా చేయడానికి చర్చలు జరిపినట్లు కామెంట్స్ వచ్చాయి.కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపోయింది. అనిల్ తోనే అఖిల్ కొత్త మూవీ అలెమోస్ట్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. 2024 జనవరిలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా 2025 లో రిలీజ్ అవుతుందట.అఖిల్ కెరీర్ లో ఇప్పుటి వరకు 6 సినిమాలు చేస్తే ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. మరి కొత్త డైరెక్టర్ తో చేస్తున్న ఈ ప్రయోగం ఆ ముచ్చటని ఎంత వరకు తీరుస్తుందో చూడాలి.