Oh My God: ఓటీటీలో ఓ మైగాడ్ 2….థియేటర్ని మించి ఉంటుందా?
ఓమైగాడ్ అన్ కట్ వర్షన్ ఓటీటీలో త్వరలో విడుదల కానుంది.
‘ఓ మై గాడ్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్ కి మూహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది. థియేటర్లలో 27 కట్స్ తో రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అన్ కట్ వెర్షన్ తో సందడి చేయనుంది.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన లెటెస్ట్ మూవీ ఓ మై గాడ్2. ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రిలీజ్ కి ముందు పలు వివాదాలను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్.
‘ఓ మై గాడ్ 2’ సినిమాకి సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికెట్ జారీ చేయడం అందరిని ఆశ్చర్యనికి గురిచేసింది. U/A సర్టిఫికెట్ ఇవ్వమని మేకర్స్ రిక్వెస్ట్ చేసిన సెన్సార్ టీమ్ ఒప్పుకొలేదు. అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయంటూ చాలా సీన్స్ తొలగించారు. 27 కట్స్ తో పాటు 25 మార్పులు సూచించారు. దీంతో హర్ట్ అయిన డైరెక్టర్ ఓటీటీలో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా అన్ కట్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నాడు. మరి బోల్డ్ సన్నివేశాలతో ఓటీటీలో వస్తున్న ఓమైగాడ్ 2 ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.