Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు ఆకునూరి మురళి పంచ్.. ఈమెగారిని వదిలిపెట్టొద్దు అంటూ ట్వీట్…
ఆకునూరి మురళి ఇప్పుడు ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ను టార్గెట్ చేశారు. ఆమె కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. స్మితా సబర్వాల్‌ను కేంద్ర సర్వీసుల్లోకి పంపించొద్దంటూ ట్వీట్ చేశారు.
Smita Sabharwal: ఆకునూరు మురళి గురించి తెలంగాణ జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్‌గా వాలెంటైర్ రిటైర్‌మెంట్ తీసుకొని.. బీఆర్ఎస్ సర్కార్ మీదే యుద్ధం ప్రకటించిన వ్యక్తి. ఆయన గత కొంతకాలంగా విద్యా, వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించి పేదలు, ఆదివాసీల మన్ననలు పొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో అణిచివేతలకు గురయ్యానని ఆరోపిస్తూ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు.
Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్..!
ఆకునూరి ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలో ఆయన సేవలను ఉపయోగిచుకుంది. ఇక తెలంగాణలో ప్రతీ సమస్యపై ఆకునూరి మురళి గొంతెత్తారు. పేపర్ లీకేజీ నుంచి రాజకీయ వ్యవహారాల వరకు ప్రతీ విషయంలో బీఆర్ఎస్‌పై ఆరోపణలు గుప్పించారు. అలాంటి ఆకునూరి మురళి ఇప్పుడు ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ను టార్గెట్ చేశారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవని స్మితా సబర్వాల్ బదిలీ ఖాయం అని ప్రచారం జరిగింది. అటు నీటి పారుదల శాఖ మీటింగ్‌కు కూడా హాజరుకాకపోవడంతో.. ఇదే ఖాయం అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి పరిణామాల మధ్య కొత్త సవాళ్లకు సిద్ధం అంటూ స్మితా సబర్వాల్.. ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆమె కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఆకునూరి మురళి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. స్మితా సబర్వాల్‌ను కేంద్ర సర్వీసుల్లోకి పంపించొద్దంటూ ట్వీట్ చేశారు.
అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి.. కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం కొంతమంది ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయిందంటూ పోస్ట్ చేశారు ఆకునూరి మురళి. తెలంగాణ ప్రభుత్వం వీళ్లను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకోవడం అని ప్రశ్నించిన ఆయన.. దేశం మొత్తంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులు పరిశీలన చేసే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే అంటూ సెటైరికల్‌గా పోస్ట్ చేశారు. ఆకునూరి ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. దీనిపై రేవంత్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.