అలెర్ట్: హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ చేంజ్

నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి చేసారు హైదరాబాద్ పోలీసులు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు అంటూ హెచ్చరించారు. నేటి నుంచే కఠినంగా నిబంధనలు అమలు చేయనున్న పోలీసులు... నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2024 | 06:43 PMLast Updated on: Nov 05, 2024 | 6:43 PM

Alert Hyderabad Traffic Rules Change

నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి చేసారు హైదరాబాద్ పోలీసులు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు అంటూ హెచ్చరించారు. నేటి నుంచే కఠినంగా నిబంధనలు అమలు చేయనున్న పోలీసులు… నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 200 రూపాయలకు పెంచారు. రాంగ్ సైడ్, రాంగ్ రూట్ లో వాహనాలు నడిపినా సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు.

రాంగ్ సైడ్, రాంగ్ రూట్ వెళితే 2000 రూపాయల జరిమానా విధించారు. సిటీలోని రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. పబ్ ల ఎదుటనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో నిర్వహించాలని హైకోర్ట్ ఆదేశించింది. ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ దీనిపై కీలక ప్రకటన చేసారు. నేటి నుంచే హెల్మెట్ మస్ట్ నిబంధన అమల్లోకి తెచ్చామన్నారు.

బైక్ నడిపే వాళ్ళలో నూటికి నూరు శాతం మంది హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్పెషల్ డ్రైవ్ లు పెట్టి నిబంధనలు అమలు చేస్తామని హెచ్చరించారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడిపితే 2 వేల రూపాయలు ఫైన్ విధిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న టూ వీలర్స్ లో ఎక్కువమంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారన్నారు. ప్రమాదాలను నివారించేందుకే నిబంధనలు కఠినతరం చేశామని తెలిపారు.