Aliens: ఏలియన్స్ భూమిపైకి వచ్చేశారా.. సైంటిస్ట్ ప్రకటనతో కొత్త టెన్షన్..!
ఏలియన్స్.. భూమిపైకి వచ్చి, మనుషులను కాంటాక్ట్ చేస్తారని అనేక వాదనలు వినిపిస్తున్నాయ్. ఐతే ఏలియన్స్ ఇప్పటికే భూమిపైకి వచ్చారనే కొత్త వాదన తెరమీదకు వచ్చింది. ఇదే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.
Aliens: ఏలియన్స్.. ఎప్పటికీ ఇదో మిస్టరీ చర్చ! భూమిపైకి వచ్చారని కొందరు.. వచ్చి వెళ్లారని ఇంకొందరు.. వస్తారని మరికొందరు.. ఏలియన్స్ నుంచి సిగ్నల్స్ అందుతున్నాయ్ అని మరికొందరు..ఇలా గ్రహాంతరవాసుల గురించి ఏళ్లుగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు..! ఏలియన్స్.. భూమిపైకి వచ్చి, మనుషులను కాంటాక్ట్ చేస్తారని అనేక వాదనలు వినిపిస్తున్నాయ్. ఐతే ఏలియన్స్ ఇప్పటికే భూమిపైకి వచ్చారనే కొత్త వాదన తెరమీదకు వచ్చింది. ఇదే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.
ఇదేదో జాతకాలు చెప్పే వాళ్లు చెప్పిన మాటలు కాదు. ప్రపంచ ప్రఖ్యాత ఫేమస్ సైంటిస్ట్ బయటపెట్టిన నిజం. అదే ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణం అవుతోంది. యూఎఫ్‍వోలను పరిశోధిస్తున్న సైంటిస్ట్ గ్యారీ నోలన్.. భూమిపై గ్రహాంతర వాసులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నోబెల్ గ్రహీత, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన గ్యారీ నోలన్.. న్యూయార్క్ మాన్‌హటన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయం చెప్పాడు. గ్రహాంతర వాసులు భూమిపై ఉన్నారా..లేదా..? వారి ఉనికి తెలుసుకునేందుకు అవకాశం ఉందా అనే విషయాన్ని కనిపెట్టే పనిని ఇటీవల పెంటగాన్ కొందరు ప్రముఖ శాస్త్రవేత్తల బృందానికి అప్పగించింది.
భూమిపై గ్రహాంతరవాసులు ఉండే అవకాశం వందశాతం ఉందని, ఇప్పుడే కాదు.. కొన్ని సంవత్సరాలుగా వారు ఉన్నారని నోలన్ వివరించారు. మనం కూడా వారిని చూసి ఉండొచ్చు. మనం అనుకున్నట్లుగా సూటూ బూటూ వేసుకొని వారు మన మధ్య నడవరు. మనం భూమి మీద ఇలాంటి వ్యక్తులను చూసే వుంటాం. కానీ వారిని ఎలా గుర్తించాలో మనకు తెలియడం లేదు అని చెప్పారు. నోలన్ లాంటి వాళ్లు చెప్పారంటే.. కచ్చితంగా నిజం ఉంటుంది. అంటే ఇప్పటికే ఏలియన్స్ భూమి మీద తిరుగుతున్నాయా.. మనమే గుర్తించలేకపోతున్నామా అనే అనుమానాలు మొదలయ్యాయ్ చాలామందిలో.