Puri Jagannath : ఎట్టకేలకు తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం..
దేశవ్యాప్తంగా అందరి చూపు ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్న భాండాగారంలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పూరీ జగన్నాథుడి నిధి తలుపులు ఇవాళ తెరిచారు. దాదాపు 46ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ 2024లో తెరుచుకున్నాయి. సరిగ్గా మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజలతో జగన్నాధుడి రహస్య గది తలుపులు తీశారు.
దేశవ్యాప్తంగా అందరి చూపు ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్న భాండాగారంలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పూరీ జగన్నాథుడి నిధి తలుపులు ఇవాళ తెరిచారు.
దాదాపు 46ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ 2024లో తెరుచుకున్నాయి. సరిగ్గా మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజలతో జగన్నాధుడి రహస్య గది తలుపులు తీశారు. ఈ రత్న భాండాగారాన్ని తెరిచే కార్యక్రమంలో సుమారుగా 11 మంది పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. జస్టిస్ బిశ్వనాథ్‌రథ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. కాగా ఈ అనంత సంపదను లెక్కించడంతో పాటుగా పూరీలో ప్రస్తుతం రథయాత్ర జరుగుతోంది. దీంతో ఈ నెల 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయ బయట ఉండనున్నారు. కాగా ఈ ఆలయం లో దేవుడు లేని సమయంలో రత్న భాండాగార గదిని అధికారులు తెరుస్తున్నారు. మరోవైపు భారత పురాణాల ప్రకారం ప్రాచీన దేవాలయం లో ఉన్న బంగారం నిధులకు కాపలా అత్యంత విషసర్పాలను ఉంచుతారనే వాస్తవిక పూరం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. స్నేక్ హెల్ప్‌లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి ఉంచారు.
కాగా ప్రస్తుతం పూరీ జగన్నాథుని రత్న భాండాగార గదిలో ఉన్న సంపదను బయటకు తీసేందుకు ఆ ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో బద్రపరిచేందు ఇప్పటికే ఆలయంలోకి చేరుకున్నాయి. 1978లో ఈ గదిని తెరిచి చివరిసారిగా అందులోని సంపదను లెక్కించారు. ఆ తర్వాత రత్న భాండాగార సంపదను లెక్కించాలని హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భాండాగారాన్ని తెరచి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేయగా.. కాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
- చివరిసారి పూరీ రత్నభాండాగారాన్ని ఎప్పుడు తెరిచారంటే?
ఒడిశాలోని పూరీ ఆలయ రత్నభాండాగారం నేడు తెరుచుకున్నాయి. 1978లో ఈ గదిని తెరిచి చివరిసారిగా అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లోనే ఆ సంపదను లెక్కించడానికి దాదాపు 72 రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో రెండు గదుల్లో రాళ్లు పొదిగిన 128.380 కేజీల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయని ఆడిట్‌లో తెలిపారు. ఆ తర్వాత మిగాతా సంపదను మేములెక్కించలేమని అధికారులు చేతులెతేసినట్లు ఆలయ అధికారు చెప్పుకోచ్చారు. మరి కొందరు ఈ అనంత సంపదను లెక్కించడం రోజులు సరిపోవని ఓ వాదన వినిపిస్తుంది. ఆ తర్వాత 1982, 1985లో లోపలి గదిని తెరిచినా లెక్కలు నిర్వహించలేదు. 2018లో తెరవాలని ప్రయత్నించినా వీలు కాలేదు.
- పూరీ రత్నభాండాగారం విశేషాలివే..
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ సమీపంలో రత్నభాండాగారం చిన్న ఆలయ తరహాలో ఉంటుంది. ఇందులో ఆభరణాలను భద్రపరిచేందుకు బహరా భాండార్(బయట గది), భితరా భాండార్(లోపలి గది) అనే రెండు గదులు ఉంటాయి. స్వామివారికి ఉపయోగించే ఆభరణాలు బయట గదిలో, ఒడిశాను పాలించిన రాజులు, నేపాల్ పాలకులు ఈ ఆలయానికి విరాళంగా అందజేసిన బంగారు, వెండి, వజ్రాలను లోపలి గదిలో భద్రపరిచారు.