అవన్నీ అవాస్తవం, వైభవ్ వయసుపై తండ్రి క్లారిటీ
ఐపీఎల్ మెగావేలంలో 13 ఏళ్ళకే కోటి రూపాయల 10 లక్షలకు అమ్ముడైన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే అతని వయసుపై కొన్ని ఆరోపణలు మొదలయ్యాయి.

ఐపీఎల్ మెగావేలంలో 13 ఏళ్ళకే కోటి రూపాయల 10 లక్షలకు అమ్ముడైన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే అతని వయసుపై కొన్ని ఆరోపణలు మొదలయ్యాయి. కొందరు వైభవ్ వయసు దాచాడని, 15 ఏళ్ళు ఉంటాయని ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ ఆరోపణలపై వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందించారు. తన కొడుకుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే మొట్టమొదటిసారి బీసీసీఐ బోన్ టెస్టు ఎదుర్కొన్నాడనీ గుర్తు చేసారు. కావాలంటే మరోసారి వైభవ్ ఏజ్ టెస్టుకు వెళ్తాడనీ సవాల్ విసిరారు. కాగా 13 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీని మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.