ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి సత్తా, నితీశ్ రికార్డుల హోరు
ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో సత్తా చాటుతున్నాడు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లోనూ సత్తా చాటుతూ జట్టులో కీలకం వ్యవహరిస్తున్నాడు.ఆడిన రెండు టెస్టుల్లో టీమిండియాకు అద్భుత సహకారాన్ని అందించాడు.
ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో సత్తా చాటుతున్నాడు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లోనూ సత్తా చాటుతూ జట్టులో కీలకం వ్యవహరిస్తున్నాడు.ఆడిన రెండు టెస్టుల్లో టీమిండియాకు అద్భుత సహకారాన్ని అందించాడు. ఈ సీరిస్ కు ముందు నితీష్ ను జట్టులోకి తీసుకోగా విమర్శలు వెల్లువెత్తాయి. సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని క్రికెట్ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే నితీష్ మాత్రం తన ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయించాడు. అంతేకాదు ఈ సిరీస్ లో తన ప్రదర్శన ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ల పేరిట ఉన్న రికార్డుల్ని బద్దలు కొట్టాడు.
పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో నితీశ్‌రెడ్డి అరంగేట్రం చేశాడు. అడిలైడ్ టెస్టు అతని కెరీర్‌లో రెండో టెస్టు. రెండు టెస్టుల్లోనూ అతని ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి. మొత్తం 4 ఇన్నింగ్స్‌లలో తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కాగా ఈ టెస్టుల్లో ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్లపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నితీశ్ నిలిచాడు. గత 2 మ్యాచ్‌ల్లో నితీష్ 6 సిక్సర్లు కొట్టాడు. నితీష్ కంటే ముందు ఆస్ట్రేలియాలో టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్లపై అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, అజింక్యా రహానే, జహీర్ ఖాన్ ల పేరిట ఉంది. ఈ ఆటగాళ్లందరి పేరిట తలో 3 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పుడు నితీష్ వాళ్ళందరిని అధిగమించాడు.
పెర్త్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నితీష్‌రెడ్డి 41, రెండో ఇన్నింగ్స్ ల్లో 38 పరుగులు నమోదు చేశాడు. అయితే అడిలైడ్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 42 అలాగే రెండవ ఇన్నింగ్స్ ల్లోనూ 42 పరుగులతో జట్టుకు అద్భుత సహకారం అందించాడు. అలాగే తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీయగా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసుకున్నాడు. కాగా నితీష్ 2 టెస్టుల్లో కలిపి మొత్తం 163 పరుగులు చేశాడు. అతని ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నితీష్ రెడ్డి ఆటతీరు చూస్తుంటే భారత క్రికెట్ భవితవ్యం కళ్ళముందు కనబడుతుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్ ఆడకపోవడం వల్ల నితీష్ కు కలిసొచ్చే అంశం. టెస్టుల్లో పాండ్యను నితీష్ తో భర్తీ చేయాలనీ మేనేజ్మెంట్ భావిస్తుంది.