శభాష్ నితీశ్.. ధోనీ సరసన తెలుగోడు
టీమిండియాలో చోటు దక్కడం అంత ఈజీ కాదు.. అందులోనూ తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి ఛాన్స్ చాలా తక్కువ మందికి దొరుకుతుంది... సుదీర్ఘ కాలం తెలుగు స్టేట్స్ నుంచి గతంలో చాలా కొద్దిమందే కొనసాగారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత పలువురు యువ ఆటగాళ్ళకు ఏపీ,. తెలంగాణ నుంచి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్నారు.
టీమిండియాలో చోటు దక్కడం అంత ఈజీ కాదు.. అందులోనూ తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి ఛాన్స్ చాలా తక్కువ మందికి దొరుకుతుంది… సుదీర్ఘ కాలం తెలుగు స్టేట్స్ నుంచి గతంలో చాలా కొద్దిమందే కొనసాగారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత పలువురు యువ ఆటగాళ్ళకు ఏపీ,. తెలంగాణ నుంచి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. ఇదే క్రమంలో విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్నాడు. టీమ్ లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అందుకున్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ పై స్వదేశంలో టీ ట్వంటీ సిరీస్ తో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి నెల వ్యవధిలోనే టెస్ట్ జట్టులో కూడా ఛాన్స్ కొట్టేశాడు. మీడియం పేస్ ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్న హెడ్ కోచ్ గంభీర్ నితీశ్ పై నమ్మకంతో ఆసీస్ టూర్ కు ఎంపిక చేయించాడు. దానిని నిలబెట్టుకుంటూ ఈ తెలుగు సంచలనం కంగారూ గడ్డపై సత్తా చాటుతున్నాడు.
తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరుదైన ఫీట్ సాధించాడు. అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ లో భారత రెండు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన నితీశ్ రెడ్డి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏడో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ ఆర్డర్‌లో వచ్చి ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన భారత నాలుగో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ముగ్గురు భారత క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 1961-62లో కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో చందు బోర్డే, 2011లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఎంఎస్ ధోనీ, 2018లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించారు. తాజాగా డే నైట్ టెస్టులో నయా ఆల్‌రౌండర్ నితీశ్ సత్తాచాటి ఈ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు.
ఈ మ్యాచ్ లో నితీశ్ చక్కని బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లలోనూ టెయిలెండర్లతో కలిసి విలువైన పరుగులు జోడించాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కనీసం 130 పరుగులైనా చేస్తుందా అనుకుంటే నితీష్ పోరాటంతో 180 స్కోర్ చేయగలిగింది. అలాగే రెండో ఇన్నింగ్స్ లో నితీశ్ రెడ్డి జట్టుకు ఇన్నింగ్స్ ఓటమి తప్పించాడు. తొలి ఇన్నింగ్స్ లో 42 , రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి ఆసీస్ బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్ ఆడాడు. అటు బౌలింగ్ లో లబూషేన్ వికెట్ తీసిన ఈ విశాఖ కుర్రాడు తనపై గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ సిరీస్ మిగిలిన మ్యాచ్ లలోనూ నితీశ్ రెడ్డి రాణిస్తే టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో మంచి ఆల్ రౌండర్ దొరికినట్టే.