Top story:స్టార్ క్రికెటర్స్ కొడుకులంతా చవటలే….ఇది సినిమా ఇండస్ట్రీ కాదు భయ్యా
పండిత పుత్ర పరమ సుంట అంటారు. ఈ మాట అన్ని రంగాల్లో నిజం కాకపోయినా క్రికెట్లో మాత్రం నూటికి నూరు శాతం నిజమౌతోంది. ఎందుకో తెలియదు గానీ స్టార్ క్రికెటర్స్ కొడుకులెవ్వరు టాప్ క్రికెటర్స్ కాలేకపోతున్నారు.
పండిత పుత్ర పరమ సుంట అంటారు. ఈ మాట అన్ని రంగాల్లో నిజం కాకపోయినా క్రికెట్లో మాత్రం నూటికి నూరు శాతం నిజమౌతోంది. ఎందుకో తెలియదు గానీ స్టార్ క్రికెటర్స్ కొడుకులెవ్వరు టాప్ క్రికెటర్స్ కాలేకపోతున్నారు. తండ్రులతో పోలిస్తే పది శాతం కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో అయితే ఏదో రకంగా జనం పై రుద్ది … కొన్నాళ్ళకి స్టార్ హీరోలను చేస్తుంటారు. క్రికెట్ లో మాత్రం ఇది అంత ఈజీ కాదు. కేవలం టాలెంట్ పైనే ఇక్కడ కెరీర్ ఉంటుంది. అందుకే ఏ క్రికెటర్ కొడుకు స్టార్ క్రికెటర్ కాలేకపోయాడు.
లాలా అమర్నాథ్. ఇండియా తరఫున టెస్ట్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్. అంతేకాదు భారత్ కు తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ కూడా. స్వతంత్ర భారతదేశనికి తొలి టెస్ట్ కెప్టెన్ కూడా అయిన లాలా అమర్నాథ్ 1952లో పాకిస్తాన్ పై మొదటి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు కి కెప్టెన్ . లాలా అమర్నాథ్ కి ముగ్గురు కొడుకులు. ముగ్గురు క్రికెటర్లే. మోహిందర్, సురేందర్, రాజేందర్. అయితే వీరిలో మోహిందర్ అమర్నాథ్ మాత్రమే సక్సెస్ అయ్యాడు. టెస్ట్, వన్డే క్రికెట్లో మోహిందర్ రాణించాడు. 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అమర్నాథ్ కీలక సభ్యుడు …. ఫైనల్స్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా. కానీ లాలా అమరనాథ్ మిగిలిన కొడుకులు సురేందర్ రాజేందర్ మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. అలాగే విజయ్ మంజరేకర్ కుమారుడు సంజయ్ మంజరేకర్ తండ్రి స్థాయిలోనే రాణించగలిగాడు. కాకపోతే సచిన్ లాగా ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేకపోయాడు.
ఇక ఇండియన్ క్రికెట్ లో ఎవరెస్ట్ శిఖరం లాంటి సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్ రంజీల్లో, ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా రాణించలేకపోయాడు. కెరీర్ లో అత్యధిక సెంచరీలు, టెస్ట్ క్రికెట్లో పదివేల పరుగులు , క్రికెట్ లో అనేక ఇంటర్నేషనల్ రికార్డులు నెలకొల్పిన గవాస్కర్ తన కొడుకుకి వెస్టిండీస్ కెప్టెన్ రోహన్ కన్హాయ్ పేరు పెట్టుకున్నాడు. కానీ పేరుకు తగినట్లు సన్నీ కొడుకు మాత్రం క్రికెట్లో రాణించలేకపోయాడు. వరల్డ్ క్రికెట్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని నిలబెట్టుకున్న సునీల్ గవాస్కర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకు రోహన్ గవాస్కర్ ని టాప్ క్రికెటర్ ని చేయలేకపోయాడు. 2004లో వన్డేల్లో ప్రవేశించిన రోహన్ అక్కడా రాణించలేకపోయాడు. ఐపీఎల్ లో కూడా 2008లో మాత్రమే కలకత్తా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత క్రికెట్ కి దూరమైపోయాడు.గవాస్కర్ గ్రేట్ క్రికెటర్…కాని ఫెయిల్యూర్ ఫాదర్ గా మిగిలిపోయాడు.
గవాస్కర్ సమకాలికుడు వివియన్ రిచర్డ్స్ పరిస్థితి కూడా అంతే. ఇంటర్నేషనల్ క్రికెట్లో రిచర్డ్స్ లాంటివాడు మళ్ళీ పుట్టడు. అలాంటి వాటిని చూడలేం. క్రికెట్లో కొదమ సింహం లాంటి రిచర్డ్స్ కొడుకు మాలి రిచర్డ్స్ తండ్రిలో ఒక్క శాతం కూడా రాణించలేకపోయాడు. అట్టర్ ప్లాప్ క్రికెటర్ గా నిష్క్రమించాడు. ఆల్ రౌండర్, 1983 వరల్డ్ కప్ టీమ్ మెంబర్, ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కొడుకు స్టువర్టు బిన్నీ కూడా అంతంతమాత్రంగానే రాణించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కొన్ని వన్డేలు ఆ తర్వాత ఐపీఎల్ లో ఆడినప్పటికీ పోటీని తట్టుకోలేకపోయాడు స్టువర్ట్ బిన్నీ. ఇక క్రికెటర్ శ్రీకాంత్ కొడుకు అనిరుద్ శ్రీకాంత్ కూడా క్రికెట్లో రాణించలేకపోయాడు. క్లబ్ క్రికెట్ కి పరిమితమైపోయాడు. ఐపీఎల్ లో 2008 నుంచి 13 వరకు సీఎస్కేకు ఆడినప్పటికీ ఎన్నడు బ్యాటింగ్ చేసింది లేదు.
అందరికన్నా విషాద గాధ సచిన్ టెండూల్కర్ ది. గాడ్ ఆఫ్ ద క్రికెట్ అని ప్రపంచం మొత్తం మంచి ప్రశంసలు అందుకున్న సచిన్ తన కొడుకు అర్జున్ టెండూల్కర్ నీ మాత్రం క్రికెటర్ గా తీర్చిదిద్దలేకపోయా డు. ఏడు….8 ఏళ్లుగా అర్జున్ కింద…. మీద పడుతున్న…, అత్యుత్తమ స్థాయి క్రికెట్ ని ఆడ లేకపోయాడు. చివరికి ఐపీఎల్ లో కూడా కేవలం సచిన్ రికమండేషన్ తో జట్టులో మాత్రం కొనసాగుతున్నాడు. ఈసారి ఐపీఎల్ లో కూడా అర్జున్ ని మొదట ఎంపిక చేయలేదు. చివరి నిమిషంలో 30 లక్షలకు తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయిన అర్జున్ ఏ రకంగా చూసిన సచిన్ లో 10 శాతం కూడా ప్రతిభ కనపరచలేకపోతున్నాడు.
రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ప్రస్తుతం మైసూర్ వారియర్స్ కు ఆడుతున్నప్పటికీ ఏ స్థాయిలో కూడ తండ్రి కన్నా గొప్ప క్రికెటర్ అవుతాడని చెప్పలేం. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడినప్పటికీ ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు. ఒకరిద్దరు మినహాయించి స్టార్ క్రికెటర్స్ కొడుకులెవ్వరు ఎందుకో స్టార్ క్రికెటర్స్ కాలేకపోయారు. దీనికి ప్రధాన కారణం క్రికెట్ సినిమా లాంటిది కాదు.ఇక్కడ జిమ్మిక్కులు చేసి పబ్లిసిటీ ఇచ్చి స్టార్స్ ను చేయడం ఇక్కడ సాధ్యం కాదు. కేవలం ప్రతిభా పాటవాలు పైన, హార్డ్ వర్క్ పైన కెరీర్ ఆధారపడి ఉంటుంది. తండ్రులు ,తాతలు చరిత్రను చెప్పుకొని క్రికెట్లో పైకి రావడం కష్టం. అసాధ్యం కూడా. అందుకే క్రికెట్లో గ్రేట్ ప్లేయర్స్… ఫెయిల్యూర్ ఫాదర్స్ గా మిగిలిపోతారు.