ఎన్నడూ ఊహించని మీటింగ్.. ఊహే నిజమైతే 5000 కోట్లు..

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కుదిరితే కాదు, ఊహిస్తే కూడా బాక్సాఫీస్ లో సునామీలొస్తాయి... ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ మేకింగ్ లో షారుఖ్ ఖాన్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. చిరుతో మణిరత్నం సినిమా రెండు మూడు సార్లు సెట్స్ వరకు వెళ్లి ఆగిపోయింది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 04:54 PMLast Updated on: Dec 20, 2024 | 4:54 PM

Allu Arjun And Ntr Multistarer Movie With Sandeep Reddy

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కుదిరితే కాదు, ఊహిస్తే కూడా బాక్సాఫీస్ లో సునామీలొస్తాయి… ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ మేకింగ్ లో షారుఖ్ ఖాన్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. చిరుతో మణిరత్నం సినిమా రెండు మూడు సార్లు సెట్స్ వరకు వెళ్లి ఆగిపోయింది.. ఇంచుమించు ఇలాంటి కాంబినేషనే టాలీవుడ్ లో సెట్ అవుతుందా? అవబోతుందా? లేదంటే ఇలాంటి ఊహగానేమిగులుతుందా? ఇలాంటి డౌట్లకు కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగ మీటింగ్ జరగటం… ఒకరు మాస్ మతిపోగొట్టే పెర్ఫామెన్స్ కి కేరాఫ్ అడ్రస్…ఇంకొకరు యూత్ మతిపోగొట్టే కల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి రెండు కటౌట్లు కలిసి సినిమా తీస్తే, పాన్ వరల్డ్ లెవల్లో వైబ్రేషన్స్ రావాల్సిందే. కాని గతంలో అనుకోకుండా కలుసుకున్న ఇద్దరు, ఈసారి కావాలనే మీటయ్యారు.. ఇంతకి ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి సునామీ వచ్చేఛాన్స్ఉంది? స్పిరిట్, యానిమల్ 2 తర్వాత ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే డిస్కర్షన్ జరుగుతోందా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా అన్న ఊహకే వైబ్రేషన్స్ వణికించేలా ఉన్నాయి. ఇదేం అసాధ్యం అనుకునే కాంబినేషన్ కాదుకాని, మరీ ఉన్న ఫలంగా ఇప్పుడే సాధ్యం అయ్యే కాంబినేషన్ కూడా కాదు. ఎందుకంటే వార్ 2 మూవీతో తారక్ జనవరి వరకు బిజీగానే గడుపుతాడు. తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ మూవీకి ఏడాదిన్నర సమర్పించుకోక తప్పదు

తర్వాత చూస్తే దేవర 2 ఆల్రెడీ లైన్లో ఉంది. కథ కూడా సిద్ధంగా ఉంది.. కాబట్టి మరో రెండేల్ల వరకు మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సందీప్ రెడ్డి సినిమా ప్రాక్టికల్ గా పాజిబుల్ కాదు. తను కూడా ఫ్రీ అవటానిక చాలాటైమే పట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ తను రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు. అది సంక్రాంతిక తర్వాత లేదంటే మార్చ్ లో లాంచ్ అయ్యేఅవకాశం ఉంది

అది పూర్తవ్టానికి ఏడాది పట్టినా, పోస్ట ప్రొడక్షన్ కి మరో ఆరునెలలు టైం పడుతుంది. ఆతర్వాత ఎలాగూ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తానన్నాడు కాబట్టి, కనీసం రెండునరేల్ల వరకు సందీప్ రెడ్డి కూడా బిజీ.. సో ఏం చేసినా ఇంకేం ప్లాన్ చేయాలన్నా రెండునరేళ్ల తర్వాతే…

ఐతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా సందీప్ రెడ్డి వంగ సినిమా ఎనౌన్స్ చేశారు కాబట్టి, అది కూడా పట్టాలెక్కితే మరో ఏడాదిన్నర సందీప్ బిజీ అయ్యే చాన్స్ ఉంది. కాబట్టి కనుచూపు మేరలో ఈసందీప్ తో ఎన్టీఆర్ సినిమా పాజిబుల్ అయ్యేలా అవకాశాలు లేవు..

కాని రెండో సారి ఈ ఇద్దరుకలుసుకున్నారు ఓసారి అనుకోకుండా మీటయ్యారు. ఈసారి వాంటెడ్ లీ మీటయ్యారు. కారణం లాస్ట్ టైం కలుసుకున్నప్పుడు చెప్పిన కథే, దాని మీదే మళ్లీ ఓసారి డిస్కర్స్ చేశారట. ఎన్టీఆర్ కి కూడా లైన్ నచ్చటంతో, ఇద్దరూ ఫ్రీ అయ్యాకే ప్లాన్ చేద్దామనే డిస్కర్షన్ జరిగిందని తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణం టీసీరీస్ సంస్థే అని తెలుస్తోంది. ఆల్రెడీ హిందీలో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ కోసం వార్ 2 మూవీ చేస్తున్నాడు తారక్. టీసీరీస్ కూడా ఎన్టీఆర్ డేట్లకోసం ట్రై చేసి, ఇలా సందీప్ రూట్లో కాంబినేషన్ వర్కవుట్ అయ్యేందుకు ప్లాన్ చేస్తుందట. సో వెంటనే కాకున్నా నియరెస్ట్ ఫ్యూచర్ లో ఈ కాంబినేషన్ సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది.