సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను ఆయన ఇంటి వద్దనే చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్లో పుష్ప సినిమా ప్రీమియర్ షో కు అల్లు అర్జున్ వెళ్ళగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కేసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఒక చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. దీనితో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురుని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ ని కూడా అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపటికి క్రితం టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.