Allu Arjun: నువ్వే కావాలి
హీరోలకి ఫ్యాన్స్ ఉండటం కామన్. కొన్ని సార్లు హీరోలే హీరోలకి ఫ్యాన్స్ అవటం కూడా రజినీకాంత్ నుంచి పవన్ వరకు చూశాం. ఐతే ఈ టాప్ హీరోలు ఎవరికి ఫ్యానో తెలుసా.? బన్నీకి ఐశ్వర్యా రాయ్ అంటే పిచ్చి.. మహేశ్ బాబుకి శ్రీదేవి అంటే అభిమానం.. ఇలా స్టార్ హీరోల ఫేవరెట్ స్టార్ ఎవరో, ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మరి షాక్ అయ్యేందుకు సిద్దమా..?

Allu Arjun is a fan of Aishwarya Rai and is looking to give her a special role in Pushpa 2.
హీరోలకి బయట ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి వాళ్లకి ఇష్టమైన స్టార్స్ ఎవరంటే యంగ్ హీరోలైతే సీనియర్ స్టార్స్ పేర్లు చెబుతారు.. ఐతే మరీ సీనియర్ కాకున్నా ఐశ్వర్యా రాయ్ అంటే బన్నీకి చాలా ఇష్టం. పుష్ప 2 లో స్పెషల్ రోల్ కి కూడా తనని సంప్రదించింది సుకుమార్ టీం. అంటే కనీసం ఇలా అయినా తనతో స్క్రీన్ పంచుకునేందుకు బన్నీ ట్రై చేస్తున్నాడనుకోవాలి.
ఐతే మెగా మామా చిరు తో ఐష్ జోడీ కట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. వశిష్ట మేకింగ్ లో చిరు, ఐష్ జోడీకి ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్లంటే భీబత్సమైన అభిమానం ఉన్న మరో స్టార్ మహేశ్ బాబు. ఈ సూపర్ స్టార్ కి దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి అంటే ప్రాణం. ఆ అభిమానంతోనే తన కూతురు జాన్వీ కపూర్ తో జోడీకట్టేందుకు సర్కారువారి పాట టైంలో గట్టిగా ట్రై చేసింది సినిమాటీం. అప్పటికే తను మూడు సినిమాలు చేస్తుండటంతో కుదర్లేదు. ఇప్పుడు తను ఫ్రీ కాని, రాజమౌళి సినిమాలో ఈమెను తీసుకునేందుకు టీం సిద్దంగా లేదట. ఆల్రెడీ దేవరలో తారక్ తోజోడీకట్టింది. రామ్ చరణ్ బుచ్చి బాబు మూవీలో మెరవనుంది.. కాబట్టే రొటీన్ అవుతుందని జక్కన్న నో చెప్పాడట
ఇక ఎన్టీఆర్ కి మాత్రం జయప్రద, శ్రీదేవి ఇద్దరంటే ప్రత్యేక అభిమానం. దేవరలో జాన్వీ కపూర్ని తీసుకోవాటంలో అతిలోక సుందరి మీద తనకున్న అభిమానమే కారనం. అందుకే
ఈ మూవీకోసం జాన్వీనే అప్రోచ్ అవటంతో, తారక్ వేయిట్ చేయకుండా వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇలా హీరోలకి కూడా అభిమాన తారల రూపంలో హీరోయిన్లు ఉండటం అరుదే.. అంటే సావిత్రి లాంటి మహానటిని అంతా ఇష్టపడటం వేరు, ఓ సామాన్యుడు హీరోయిన్ ని ఆరాదించేలా, ఓ హీరో ఆరాధించటం వేరు.. అలాంటి అరుదైన అభిమానాన్ని మన హీరోలనుంచి శ్రీదేవి, ఐశ్వర్య రాయ్ సొంతం చేసుకున్నారు.