Allu Arjun: అల్లు అర్జున్ డే ఎలా స్టార్ట్ అవుతుందంటే?
పుష్ప 2 షూటింగ్ సెట్ ఎలా ఉందో చూపించిన బన్నీ

Allu Arjun shared a one day tour video on his Instagram platform
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పా మూవీ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. బన్నీ ప్రతి మూమెంట్ తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే మంగళవారం తన ఇన్ స్టా స్టోరీలో సంథింగ్ స్పెషల్ ఉండనుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ చెప్పబోయే స్పెషల్ న్యూస్ ఏంటీ అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో తను ఒక రోజులో ఏం చేస్తారనే చూపించారు.
ఆ వీడియోలో అల్లు అర్జున్ హోం టూర్ చేశారు. మార్నింగ్ తన డే స్టార్ట్ చేయడం దగ్గర్నుంచి.. సాయంత్రం వరకు ఏమేం చేస్తారనే చూపించారు. ముందుగా ఇంట్లోని గార్డెన్ లో యోగ చేయడం.. ఆ తర్వాత ఉదయం రోజు తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడటం.. అక్కడి నుంచి పుష్ప సెట్ కు వెళ్లడం.. షూటింగ్లో పాల్గొనడం అన్ని విషయాలను చూపించారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.