Allu Arjun : ఓటు వేసిన ఐకాన్ స్టార్.. నంద్యాల పర్యటనపై అల్లు అర్జున్ హాట్ కామెంట్స్..

తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని కుండ బద్దలుకోట్టి మరి చెప్పారు. నా అనుకునే వాళ్లకు తప్పకుండా సపోర్ట్ చేస్తానని బ‌న్నీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి వ్యక్తిగతంగా మద్దతు ఇస్తానని తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 13, 2024 | 11:16 AMLast Updated on: May 13, 2024 | 11:16 AM

Allu Arjuns Hot Comments On Nandyalas Visit To The Voted Icon Star

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్.. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతున్న పోలింగ్. ఉదయం జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ స్కూలో ఉన్న పోలింగ్ బూత్ వద్ద ఓటు చేసిన పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… కఈ సందర్భంగా నంద్యాలలో తన పర్యటన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా స్నేహితుడికి మాట ఇచ్చా.. అల్లు అర్జున్

తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని కుండ బద్దలుకోట్టి మరి చెప్పారు. నా అనుకునే వాళ్లకు తప్పకుండా సపోర్ట్ చేస్తానని బ‌న్నీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి వ్యక్తిగతంగా మద్దతు ఇస్తానని తెలిపారు.

ప్రచారంకు చివరి రోజునా నంద్యలలోని తన స్నేహితుడికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డి 15 ఏళ్లుగా నాకు ఫ్రెండ్.. ఆయ‌న‌ రాజ‌కీయాల‌లోకి వస్తే తప్పకుండా మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాను. కానీ, 2019లో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక వెళ్లి క‌ల‌వ‌లేక‌పోయాను. ఇచ్చిన మాట నిల‌బెట్టుకునేందుకు ఒక్క‌సారైనా క‌న‌ప‌డాల‌ని నా మ‌న‌సులో ఉంది. అందుకే నా భార్య స్నేహ‌తో కలిసి వెళ్లి రవికి విషెస్ చెప్పాను” అని అల్లు అర్జున్ వివ‌రించారు. రాష్ట్ర ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి పిలుపునిచ్చారు అల్లుఅర్జున్..

గత శనివారం అల్లు అర్జున్ నంద్యాలలోని వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో యువత గుమికూడారు. ప‌ట్ట‌ణంలో 30 పోలీసు యాక్టు, 114 సెక్ష‌న్ అమ‌ల్లో ఉండ‌గా.. అల్లు అర్జున్ కారణంగా వందల సంఖ్యల్లో ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేశామ‌ని ఎన్నిక‌ల అధికారి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు.

Suresh SSM