Pawan banny : పవన్‌కళ్యాణ్‌పై అల్లు అర్జున్ ట్వీట్.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎ.పి.లో మే 13న జరిగే ఎన్నికలపైనే అందరి దృష్టీ ఉంది.

Allu Arjun's tweet on Pawan Kalyan.. Bunny comments are going viral!
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎ.పి.లో మే 13న జరిగే ఎన్నికలపైనే అందరి దృష్టీ ఉంది. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేతను సంతరించుకుంది. దీంతో అతనికి మద్దతుగా స్వయంగా మెగాస్టార్ ఫ్యామిలీ ప్రచారంలోకి దిగుతోంది. ముందుగా చిరంజీవి స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తమ్ముడికి ఓటు వేయమని మెగాస్టార్ రిక్వెస్ట్ చేశారు.
ప్రస్తుతం రామ్‌చరణ్, నాని వంటి హీరోలు కూడా సోషల్ మీడియా వేదికగా పవన్‌కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. ఆల్రెడీ సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలు ప్రచారం జోరుగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా ఓ ట్వీట్ ద్వారా పవన్‌కళ్యాణ్‌ను సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘మీ ఎన్నికల ప్రయాణం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవకే అంకితమై మీరు ఎంచుకున్న మార్గం పట్ల నాకెప్పుడూ గర్వంగానే ఉంటుంది.. ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను’ అని బన్ని తన ట్వీట్‌లో ఆకాంక్షించారు.