భారత్ తో ఎప్పుడూ సవాలే, నితీశ్ పై కమ్మిన్స్ ప్రశంసలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ సారి మరింత క్రేజీగా మారింది. గత రెండు సార్లు టీమిండియానే పైచేయిగా సాధించడం ఆస్ట్రేలియా జీర్ణించుకోలేకపోతోంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ సొంతగడ్డపై తమదే పైచేయిగా నిలవాలని పట్టుదలగా ఉన్న కంగారూలు సిరీస్ కోసం రెడీ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2024 | 08:55 PMLast Updated on: Nov 21, 2024 | 8:55 PM

Always A Challenge With India Cummins Praises Nitish

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ సారి మరింత క్రేజీగా మారింది. గత రెండు సార్లు టీమిండియానే పైచేయిగా సాధించడం ఆస్ట్రేలియా జీర్ణించుకోలేకపోతోంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ సొంతగడ్డపై తమదే పైచేయిగా నిలవాలని పట్టుదలగా ఉన్న కంగారూలు సిరీస్ కోసం రెడీ అయ్యారు. ఈ సారి జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ భారత్ కు ఎంత కీలకమో, అటు ఆసీస్ కు కూడా అంతే కీలకం.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు సారథి ప్యాట్ కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు చేసాడు. గత రెండు పర్యటనల్లో ఓటమిని గుర్తుంచుకున్న కమ్మిన్స్ టీమిండియాతో పోటీ ఎప్పుడూ సవాలేనని అంగీకరించాడు. భారత్ జట్టుతో బోర్డర్ గావస్కర్ ట్రోపీ హోరాహోరీగా సాగుతుందన్నాడు. టీమిండియా తమ సొంతగడ్డపై వరుసగా మూడు టెస్టులు ఓడిపోయిన తర్వాత ఆసీస్ టూర్ కు వచ్చిందని, వారిపై వారిపై ఒత్తిడి ఉండటం సహజమేని చెప్పాడు.

అదేసమయంలో తమ జట్టుపైనా ఒత్తిడి ఎక్కువగానే ఉందన్నాడు. ఎందుకంటే స్వదేశంలో ఆడుతున్నప్పుడు ఏ జట్టుకైనా కాస్త ఒత్తిడి ఉంటుందని, ఫ్యాన్స్ చాలా అంచనాల పెట్టుకుంటారని వ్యాఖ్యానించాడు. ఇక భారత్ జట్టులో టాలెంటెడ్ క్రికెటర్లు చాలా మందే ఉన్నారని, గతంతో పోలిస్తే ఈ సారి మరింత సవాల్ ఎదురవుతుందని కమ్మిన్స్ అంచనా వేశాడు. అయితే తాము ప్రత్యర్థి జట్టు గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన కొత్త బ్యాటర్ నాథన్ మెక్ స్వీనీ తన న్యాచురల్ బ్యాటింగ్ నే ఆడాలని సూచించాడు.

మరోవైపు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సహచర ఆటగాడు నితీశ్ రెడ్డి గురించి కమిన్స్ కూడా కమ్మిన్స్ మాట్లాడాడు. నితీశ్ రెడ్డి ప్రతిభావంతమైన ఆటగాడని కితాబిచ్చాడు. ఆల్ రౌండర్ గా మంచి స్థాయికి ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్, ఆసీస్ మధ్య తొలి టెస్ట్ పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే టీమిండియా ఈ సిరీస్ లో 4-0తో గెలవాల్సి ఉంటుంది. అటు ఆసీస్ కు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు ఈ సిరీస్ కీలకం కానుండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.