అమరన్ మూవీ రివ్యూ, దేశభక్తి ఉంటే చూడాల్సిందే
తమిళ సినిమాలకు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు వస్తోంది. ఇప్పుడు అమరన్ అనే పాన్ ఇండియా సినిమాతో మరోసారి కోలీవుడ్ మెరిసింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల అయింది.
తమిళ సినిమాలకు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు వస్తోంది. ఇప్పుడు అమరన్ అనే పాన్ ఇండియా సినిమాతో మరోసారి కోలీవుడ్ మెరిసింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల అయింది. అసలు సినిమా ఎలా ఉంది ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
అమరన్‌లో శివకార్తికేయన్ ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్‌లో అంకితభావంతో పనిచేసే మేజర్ ముకుంద్ వరదరాజన్‌గా నటించారు. అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్‌గా సాయి పల్లవి నటించగా… రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన వీర మేజర్ వరదరాజన్‌కు నివాళిగా తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, R. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మించారు.
ఇక కథ విషయానికి వస్తే… 44వ రాష్ట్రీయ రైఫిల్స్ కు స్వచ్ఛందంగా పనిచేసిన భారత ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ కు కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక కార్యాకాలపాల విధులకు పంపిస్తారు. అక్కడి నుంచి సినిమా చాలా ఉత్కంటగా ఉంటుంది. అతని వ్యక్తిగత జీవితంలో ప్రేమ సహా అనేక కీలక విషయాలను ఈ సినిమాలో చూపిస్తారు. హీరో చేసే పోరాటాలు, అతని త్యాగం చూసి సాయి పల్లవి భార్యగా అతనికి అండగా ఉంటుంది. ఈ సినిమా డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్ అంటే చాలా వరకు సాఫ్ట్ గా ఉంటుందనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంటుంది.
సైనికుడి జీవితంలో ఉండే కష్టాలను, వాళ్ళు చేసే పోరాటాలను చాలా బాగా చూపించారు. హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ పాయింట్. చాలా సినిమాల్లో ఆర్మీ అధికారులు అంటే చిన్న చిన్న పోరాటాలు చూపిస్తూ ఉంటారు. కాని అమరన్ కోసం శివ కార్తికేయన్ చాలా బాగా కష్టపడ్డాడు. యుద్ధభూమిలో ఉండే వాస్తవ పరిస్థితులను చాలా బాగా చూపించారు. అమరన్ సినిమాలో… కేవలం యుద్ధాల గురించి మాత్రమే కాకుండా సైనికులు, వారి కుటుంబాల ఆత్మస్థైర్యం, ధైర్యం, వారి త్యాగాల గురించి చాలా బాగా చూపించారు.
మేజర్ పాత్రలో శివ కార్తికేయన్ నటనకు ఫిదా అయిపోవచ్చు. అసలు సినిమా అతని కోసం చూడవచ్చు అన్నట్టు ఉంటుంది. కచ్చితంగా తనలో కొత్త కోణం చూపించాడు హీరో. డైరెక్టర్ సెలెక్షన్ తప్పు అని ఏ సీన్ లో కూడా డౌట్ రాకుండా కంప్లీట్ యాక్షన్ చేసాడు. ఇక సాయి పల్లవిని సెలెక్ట్ చేయడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్. తనకు వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా సరే భర్తకు అండగా నిలబడటం చాలా బాగా చూపించారు. ఓవరాల్ గా డైరెక్టర్ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. దేశభక్తి ఉన్న ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. లవ్ స్టోరీ కూడా చాలా అందంగా ఉంటుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా తీసారు. దీపావళికి మంచి హిట్ కొట్టినట్టే.