Amarnath yatra 2024 : అమర్ నాథ్ యాత్ర స్టార్ట్… మొదటి బ్యాచ్ లో 4,603 మంది..
అమర్నాథ్ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే.. భూకైలంలో ఉన్న హిమాలయ పర్వతాల్లో స్వయంభుగా కోలువైన మంచు లింగం.. ఏటా హిందువులు అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు.

Amarnath yatra started... 4,603 people in the first batch..
అమర్నాథ్ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే.. భూకైలంలో ఉన్న హిమాలయ పర్వతాల్లో స్వయంభుగా కోలువైన మంచు లింగం.. ఏటా హిందువులు అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు. జమ్మూ కాశ్మీర్ మంచు పర్వత గుహల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అద్బుత మంచు లింగం..
2024 సంవత్సరానికి అమర్ నాథ్ యాత్ర ప్రరంభం అయ్యింది. (జూన్ 29న) జమ్మూకశ్మీర్(jammu and kashmir) గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు(pilgrims) బయలుదేరారు. జమ్మూలోని భగవతి నగర్‌లోని యాత్రి బేసిక్ క్యాంప్ నుండి 4,603 మంది యాత్రికులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో.. యాత్రికులు మధ్యాహ్నం కాశ్మీర్ లోయకు చేరుకోగా అక్కడ వారికి స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. రెండవ బ్యాచ్ కూడా యాత్రకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.. అమర్ నాథ్ యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు.. ఇతర పారామిలటరీ బలగాలకు చెందిన వేలాది మంది భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ యాత్రకు అధికార యంత్రాంగం…పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.
అమర్ నాథ్ యాత్ర పొడువునా… పుణ్యక్షేత్రం బోర్డు గతం ఏడాది కంటే ఈ సారి వైద్య సెంటర్లను పెంచింది. 100-100 ఐసీయూ పడకలు, అధునాతన పరికరాలు, ఎక్స్‌రే, అల్ట్రాసోనోగ్రఫీ యంత్రం, క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాక్ మానిటర్లు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌తో కూడిన క్లినిక్ ఏర్పాటు చేసింది అమర్ నాథ్ యాత్ర బోర్డు.. యాత్ర మార్గాల్లో 6,000 మంది వాలంటీర్లను నియమించారు. ఈ సంవత్సరం యాత్ర కోసం 3.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ సంవత్సరం 5 లక్షలకు పైగా యాత్రికులు వస్తున్నట్లు అంచనా…
- అమర్ నాథ్ యాత్రకు భారీ భద్రతా..
అమర్ నాథ్ యాత్ర POK- ఇండో టిబెట్ బార్డర్ లో జరుగుతుండటంతో ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువ ఉండటంతో అమర్ నాథ్ యాత్రకు భారీగా పోలీస్, ఆర్మీ సిబ్బందితో కట్టుదిట్టం చేశారు.
అమర్‌నాథ్ యాత్ర కోసం 13 పోలీసు బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 11, ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఎనిమిది, బీఎస్‌ఎఫ్‌కు చెందిన 4, సీఆర్‌పిఎఫ్‌కు చెందిన రెండు బృందాలను హై సెక్యూరిటీ పాయింట్ల వద్ద మోహరించారు. 52 రోజుల పాటు కొనసాగే ఈ తీర్థయాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. ఈ మేరకు అధికారులు ప్రజలకు సమాచారం అందించారు.
- శివపార్వతుల రహస్య ప్రదేశం ఈ అమర్ నాథ్..
అమర్నాథ్ అనే ప్రదేశం శివపార్వతులు రహస్య ప్రదేశం అని హిందూ గ్రంధాలలో చెప్పబడింది. హిందూ మతంలో అమర్‌నాథ్ యాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీని ప్రాముఖ్యత అనేక మత గ్రంధాలలో కూడా ప్రస్తావించబడింది. పరమశివుడు పార్వతీ మాతకి ఎన్నో రహస్యాలు చెప్పిన ప్రదేశం ఇదేనని చెబుతారు.
- యాత్రికులు మోదీ శుభాకాంక్షలు..
ప్రధాని నరేంద్ర మోదీ యాత్రికులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు, అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లో విశ్వాసం మరియు ఐక్యతకు చిహ్నంగా యాత్ర యొక్క ప్రాముఖ్యతను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హైలైట్ చేశారు.