Nita Ambani : నీతా అంబానీ తాగే నీళ్లు లీటర్‌కు అన్ని లక్షలా!
ఏషియాలోనే నెంబర్ వన్ రిచ్ ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీ. వాళ్ల ఇంట్లో ఏం జరిగినా అది హాట్ టాపికే అవుతుంది. రీసెంట్‌గానే ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి చేశారు ముఖేష్ అంబానీ.
ఏషియాలోనే నెంబర్ వన్ రిచ్ ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీ. వాళ్ల ఇంట్లో ఏం జరిగినా అది హాట్ టాపికే అవుతుంది. రీసెంట్‌గానే ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి చేశారు ముఖేష్ అంబానీ. దేశ విదేశాల నుంచి సినీ,రాజకీయ,క్రీడా,వ్యాపార ప్రముఖులంతా ఈ పెళ్లిలో ఒకే రూఫ్ కిందకు వచ్చారు. దీంతో ఆ రోజు వరల్డ్ మీడియా మొత్తం అంబానీ ఫ్యామిలీనే ఫోకస్ చేసింది. కేవలం అంబానీ ఇంట్లో జరిగే ఫంక్షన్లే కాదు.. వాళ్లు వాడే వస్తువులు కూడా వార్తల్లో నిలుస్తుంటాయి. ఇదే క్రమంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ఇప్పుడు ఇటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే అవి నార్మల్ నీళ్లు కాదు. ఒక లీటర్ ఏకంగా 27 వేలు.
ఇక ఆ బాటిల్ ఖరీదు ఏకంగా 49 లక్షలు. ఈ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు. కేవలం వసంత కాలంలో మాత్రమే.. ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్‌లో ఏర్పడే గ్లేషియర్స్ నుంచి వీటిని సేకరిస్తారు. ఈ నీళ్లలో ఖనిజాలు, లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీళ్లు తాగితే బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మం మెరుస్తూ ఉంటుంది. బాడీలో మెటబాలిజం పెరుగుతుంది. అందుకే ఈ నీళ్లకు అంత క్రేజ్. ఇక ఈ నీతా తాగే ఈ బాటిల్ ఖరీదు కూడా ఏకంగా 49 లక్షలు. ప్రముఖ మెక్సికన్ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను తయారు చేశాడు. ఇది పూర్తిగా బంగారంతో తయారు చేసిన బాటిల్. దీని పేరు అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ రికార్డ్‌ను సైతం సొంతం చేసుకుంది. ప్రజెంట్ నీతా అంబానీ ఇదే వాటర్ బాటిల్‌లో లీటర్ 27 వేల విలువ చేసే వాటర్ తాగుతున్నారు. ఇదే ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్. కానీ నిజంగానే నీతా అంబానీ ఇంత ఖరీదైన నీళ్లు తాగుతున్నారా అంటే.. ఇది కంప్లీట్‌గా ఫేక్ న్యూస్.
ఈ మాట స్వయంగా నీతా అంబానీనే చెప్పారు. ఈ వాటర్ గురించి ఓ ఈవెంట్‌లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. వాళ్ల ఫ్యామిలీ అంతా ఆల్కలైన్ వాటర్ తాగుతున్న మాట నిజమే కానీ ఇలా లీటర్‌కు 27 వేలు విలువ చేసే నీళ్లు మాత్రం తాగడంలేదని చెప్పారు. ఇక ఈ గోల్డ్ వాటర్ బాటిల్ కూడా నీతా అంబానీ దగ్గర ఉందా అంటే.. ఇప్పటి వరకూ ఎక్కడా ఈ బాటిల్‌తో నీతా అంబానీ కనిపించలేదు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఫొటోలు కూడా మార్ఫింగ్ ఫొటోలు అని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లో నీతా అంబానీ వాటర్ తాగుతున్న ఫొటోను గోల్డ్ బాటిల్‌తో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఇంటర్నెట్‌లో నెటిజన్లు అంటున్నారు. ఒరిజినల్ ఫొటోలను మార్ఫింగ్ ఫొటోలను జతచేసి పోస్ట్ చేస్తున్నారు. మరి వాటర్ గురించి క్లారిటీ ఇచ్చినట్టే ఈ బాటిల్ గురించి కూడా నీతా అంబానీ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.