Anant Ambani Wedding : ఆషాఢమాసంలో అంబానీ పెళ్లి.. అసలు కారణం ఏంటంటే?

ప్రజెంట్‌ ఎక్కడ చూసినా అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్‌ పెళ్లి గురించే టాక్‌ నడుస్తోంది. అంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ సౌత్‌ ఇండియాలో చాలా మందికి ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఉన్న డౌట్‌.. ఆషాఢమాసంలో పెళ్లి చేయడం ఏంటి అని.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 13, 2024 | 01:35 PMLast Updated on: Jul 13, 2024 | 1:35 PM

Ambanis Wedding In The Month Of Ashada What Is The Real Reason

 

 

ప్రజెంట్‌ ఎక్కడ చూసినా అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్‌ పెళ్లి గురించే టాక్‌ నడుస్తోంది. అంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ సౌత్‌ ఇండియాలో చాలా మందికి ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఉన్న డౌట్‌.. ఆషాఢమాసంలో పెళ్లి చేయడం ఏంటి అని. ఆషాఢ మాసం అంటే తెలుగు సంవత్సరాదిలో ఒక మూఢం. ఎలాంటి శుభకార్యాలు, మంచి పనులు ప్రారంభించడానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఆషాఢంలో పెళ్లిలకు మూఢం అని తెలుగు వాళ్లు బాగా నమ్ముతారు. ఈ ఆషాఢ మాసంలో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయరు. అంతేకాకుండా కొత్త కోడలు అత్తారింట్లో కూడా ఉండదు.

ఇలాంటి ఆచారాలు ఆషాఢ మాసంలో ఎన్నో ఉంటాయి. అయితే ఇదే ఆషాఢ మాసంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరుగుతోంది. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తోంది కదా.. ఈ సమయంలో పెళ్లి ఏంటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ముహుర్తం ఎలా నిర్ణయించారా అని ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు. అయితే అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ ముహూర్తాన్ని దృక్‌గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు.

దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు.. ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభ ముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపిస్తున్నారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పండితులు చెబుతున్నారు. ఒక ప్రాంతం ఆచారాలకు.. మరో ప్రాంతం ఆచారాలకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అంబానీ వారి పెళ్లి ముహూర్తానికి.. ఉత్తరాది వారు ఆచరించే సూర్యమాన పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించారు. సూర్యమాన పంచాంగంలో అధికమాసం అనే ప్రస్తావనే ఉండదు. అందుకే తిథులు, ముహూర్తాల విషయంలో చాలా తేడాలు ఉంటాయి. అంబానీ పెళ్లి

ముహూర్తానికి.. పరమ మిత్ర తార కలిగిన శుభ ఘడియలు చూశారు.
అంతేకాకుండా ఆ ముహూర్తానికి వివాహముహూర్తం కూడా ఉందని ఉత్తరాదికి చెందిన పండితులు చెబుతున్నారు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ జులై 12వ తేదీన జరిగింది. శుభ్ వివాహ్‌తో పెళ్లి వేడుకలు మొదలై జులై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్. జులై 14వ తేదీన మంగళ్ ఉత్సవ్‌తో పూర్తి కానున్నాయి. సూర్యమానం ప్రకారం శుక్రవారం మేషరాశిలో.. చంద్రుడి సంచారం.. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూంటాడు. ఇక చంద్రుడు పగలు, రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమానం పంచాంగం చెబుతోంది. అందుకే ఆషాఢంలో కూడా అంగరంగవైభవంగా అంబానీ పెళ్లి జరుగుతోంది.