Ambati rayudu: క్రికెట్‌లో రాయుడిని తొక్కేసిన ‘తెలుగు’వాళ్లే రాజకీయాల్లోనూ తొక్కలని చూస్తున్నారా? బురద జల్లే కార్యక్రమం మొదలైపోయిందిగా!

మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు పేరు చెప్పగానే తెలుగు తమ్ముళ్లకు బీపీ లేస్తోంది. నిన్నమొన్నటివరకు మా రాయుడికి అన్యాయం జరిగిందని అని వాపోయిన ఆ గోంతులు ఇప్పుడు అంబటిని విలన్‌ చేసే ప్రయత్నాల్లో మునిగిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2023 | 04:33 PMLast Updated on: Jun 14, 2023 | 4:33 PM

Ambati Rayudu Interview With Popular Telugu Channel Heats Up War Between Ex Cricketer And Telugu Desham Party Tdp

రాజకీయాల్లో చంద్రబాబే కాదు.. ఆయన్ను ఫాలో అయ్యే కార్యకర్తలు, నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా యూ టర్న్‌ తీసుకోవడంలో ఆరితేరిన వాళ్లు. మాట మార్చడానికి సాధారణంగా ఒక గంటో, రెండు గంటలో సమయం పడుతుంది..కానీ తెలుగు దేశం నేతలకు మాట మార్చడం సెకండ్‌ పని..! 2018వరకు బీజేపీతో చట్టాపట్టాలేసుకోని తిరిగిన చంద్రబాబు.. ఆ తర్వాత మోదీని పర్శనల్‌గా టార్గెట్‌ చేసే స్టేజీకి వెళ్లిపోయారు. ఇలా యూ టర్న్‌ తీసుకోని అటాక్ చేయడంలో టీడీపీ తర్వాతే ఏ పార్టీ అయినా..! తాజాగా అంబటి రాయుడు విషయంలోనూ అదే జరిగింది. అంబటి రాయుడికి అన్యాయం జరిగిందని..అందుకే టీమిండియా తరఫున ఎక్కువ కాలం ఆడలేకపోయాడని నిన్నమొన్నటివరకు ఏడ్చిన వాళ్లలో టీడీపీ అభిమానులు కూడా ఉన్నారు. వాళ్లు ఇప్పడంతా రూట్ మార్చారు. యూ టర్న్‌ తీసుకోని రాయుడుని ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చెప్పాలంటే బురద జల్లేందుకు కంకణం కట్టుకున్నారు.

తాజాగా అంబటిరాయుడిని ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో రాయుడు అందరికి తెలిసిన విషయాలే చెప్పాడు. త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న రాయుడిని రాజకీయాలపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అటు తన కెరీర్‌కి విలన్లు ఎవరో రాయుడుతోనే చెప్పించే ప్రయత్నం చేశారు. రాయుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. తన కెరీర్‌ ఎదగకపోవడానికి కారణమైన శివలాల్‌ యాదవ్‌, ఎమ్మెస్కే ప్రసాద్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు రాయుడు. నిజానికి రాయుడు చెప్పిన విషయాలు అందరికి తెలిసినవే.. అందులో కొత్తవేమీ లేవు. వీటిని ఒకప్పుడు అందరూ సమర్ధించిన వాళ్లే.. అంగీకరించినవాళ్లే..!

2019 వరల్డ్‌ కప్‌లో రాయుడికి ఛాన్స్‌ ఇవ్వకపోవడంతో అప్పటి సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై ‘3డీ’ కౌంటర్లు వేసిన రాయుడు ఆ వెంటనే రిటైర్‌మెంట్ ప్రకటించేశాడు. ఈ విషయాన్ని చాలా వార్తా సంస్థలు హైలెట్ చేశాయి. రాయుడికి జరిగిన అన్యాయం గురించి అనేక కథనాలు రాశాయి. ఓ ప్రముఖ వార్త సంస్థ.. ఫ్రంట్‌ పేజీలోనే రాయుడు వార్త ప్రచురించింది. ఇప్పుడవే సంస్థలు.. పనిగట్టుకోని రాయుడుపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. అప్పుడెప్పుడో రాయుడు రోడ్డుపై గొడవపడ్డ వీడియోలను…పాచిపోయిన వార్తలును తవ్వి తీసి మరీ విమర్శలు గుప్పిస్తున్నాయి. బూతు రాయుడంటూ కొత్త పేర్లు పెడుతున్నాయి.. మరికొందరమే రాయుడికి టాలెంట్‌ లేదు అని.. అది కప్పిపుచ్చుకోవడానికే శివలాల్‌ యాదవ్‌, ఎమ్మెస్కే పేర్లును వాడుకుంటున్నాడని పిచ్చి వాగుడు వాగుతున్నారు. వీళ్లంతా ఒకప్పుడు రాయుడి మీద ఆపారమైన జాలీ చూపించిన వాళ్లు. రాయుడు వైసీపీకి దగ్గర అవ్వకుండా టీడీపీలోకి వచ్చే ఛాన్స్‌ ఉండి ఉంటే ఈ విధమైన రాతలు కనిపించేవి కావు. అంటే తన పొలిటికల్‌ కెరీర్‌ ఎటువైపు ఉండాలో కూడా రాయుడు నిర్ణయించుకోకూడదా? క్రికెట్‌లో రాయుడిని తొక్కిన ‘తెలుగు’ వాళ్లే.. రాజకీయాల్లోనూ అతడిని తొక్కాలని చూస్తున్నారు.