PM Modi Tweet: అయ్యో.. అది తిట్టుకాదబ్బా.. పొగడ్త..! షేమ్‌లెస్ మోదీ అసలు మీనింగ్ ఏంటంటే..?

ప్రధాని మోదీ అమెరికా పర్యటన అద్భుతంగా ముగిసింది. నిజంగానే మోదీకి అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్ గొప్ప అతిథ్యమిచ్చారు. అమెరికా ప్రతినిధులు కూడా మోదీపై ప్రసంశలు కురిపించే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ట్విట్టర్‌లో యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధి టిమ్ బర్చెట్ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 24, 2023 | 04:53 PMLast Updated on: Jun 24, 2023 | 4:58 PM

America State Representative Tim Burchett Tags Modi Selfie With Shameless Word Twitter In Confusion As Modi Retweets It

PM Modi Tweet: షేమ్‌లెస్‌ అంటే సిగ్గులేనోడు అని మనందరికీ తెలిసిన అర్థం. అయితే ఆ పదాన్ని అమెరికా వాళ్లు వేరే సందర్భాల్లో కూడా వాడుతుంటారని ఇవాళే మన ఇండియన్స్‌కి తెలిసింది. ‘షేమ్‌లెస్‌’ మోదీ ట్వీట్‌ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రేండ్‌ అవుతుంది.. ఇంతకీ ఏంటా షేమ్‌లెస్‌ మీనింగ్‌..?
ప్రధాని మోదీ అమెరికా పర్యటన అద్భుతంగా ముగిసింది. నిజంగానే మోదీకి అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్ గొప్ప అతిథ్యమిచ్చారు. అమెరికా ప్రతినిధులు కూడా మోదీపై ప్రసంశలు కురిపించే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ట్విట్టర్‌లో యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధి టిమ్ బర్చెట్ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. షేమ్‌లెస్‌(shameless) అంటూ మోదీని ట్యాగ్‌ చేసి మరీ వాళ్లిద్దరూ కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు టిమ్ బర్చెట్. ఓ దేశ ప్రధానిని పట్టుకోని షేమ్‌లెస్‌ అంటాడా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. టిమ్‌ బర్చెట్ చేసిన ఆ ట్వీట్‌కి మోదీ ఏకంగా థ్యాంక్య్‌ చెబుతూ రీట్వీట్ చేయడంతో అసలేం జరుగుతుందో అర్థంకాలేదు. మోదీ ట్విట్టర్‌ టీమ్‌ చూసుకోకుండా రీట్వీట్ చేసిందని కొందరు వాదిస్తుండగా.. మరికొందరు మాత్రం మోదీకి ఇంగ్లీష్‌ రాదంటూ పోస్టులు పెట్టారు. అసలు టిమ్ బర్చెట్ అలా ఎందుకు పెట్టాడన్నదానిపై మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు.

ఇంతకీ టిమ్ బర్చెట్ ఎందుకలా పెట్టారు..? షేమ్‌లెస్‌ని వేరే మీనింగ్‌ వచ్చే సెన్స్‌లోనూ వాడుతారా..? ఇంగ్లీష్‌ని ఎంగిలి భాష అని కొందరూ ఎగతాళి చేస్తుంటారు. అంటే ఇతర భాషల నుంచి అనేక పదాలను కలుపుతూ ఇంగ్లీష్‌ భాష పట్టిందన్నది వారి వాదన.. అది నిజమే కావొచ్చు.. కానీ అలా ఎగతాళి చేయడం తప్పే అవుతుంది. ఎందుకంటే దాదాపు ప్రతి భాషా ఏదో ఒక భాష నుంచే వచ్చింది. డెడ్‌ లాంగ్వేజెస్‌గా పిలవబడే లాటిన్‌, సంస్కృత భాషల మూలాలున్న పదాలను మనకి తెలియకుండానే వినియోగిస్తుంటాం. ఇక ఎన్ని భాషలు వాడుకలో ఉన్నా ఇంగ్లీష్‌ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యింది.  బ్రిటిష్‌ వాళ్లు చాలా దేశాలను పాలించడం వల్ల ఇంగ్లీష్‌ స్ప్రెడ్ అయ్యింది. అటు అమెరికాలోనూ అలానే వ్యాపించింది. అయితే ఇంగ్లీష్‌ ప్రతిదేశంలోనూ ఓకేలా ఉండదు. ముఖ్యంగా అమెరికా ఇంగ్లిష్‌కు, బ్రిటన్‌ ఇంగ్లిష్‌కూ మాట్లాడడంలోనూ, ఫొనిటిక్స్‌లోనూ, స్పెల్లింగ్స్‌లోనూ డిఫరెన్స్‌ ఉంటుంది. బ్రిటన్‌ వాళ్లు ఇంగ్లిష్‌ని సంప్రాదాయంగా వాడితే అమెరికా వాళ్లు తమకు నచ్చిన విధంగా భాషను అడెప్ట్ చేసుకున్నారు. అదే సమయంలో ఓకే పదాన్ని వివిధ సందర్భాల్లో వాడటంలో అమెరికా తర్వాతే ఎవరైనా. అలానే ‘షేమ్‌లెస్‌ మోదీ’ అనే పదాన్ని టిమ్‌ బర్చెట్ వినియోగించారు.
ఈ ‘షేమ్‌లెస్‌ సెల్ఫీ’ అనే పదం అండ్రాయిడ్‌ ఫోన్లు విస్తరిస్తున్న సమయంలో ఎక్కువగా ఫేమస్‌ అయ్యింది.. అప్పట్లో ఇన్‌స్టాలో ఈ పదం ట్రెండ్‌ అయ్యింది కూడా. దీనికి అర్థం ‘సిగ్గులేనోడు’ అని కాదు. ఇతరులు ఏం అనుకుంటారోనని పట్టించుకోకుండా తీసుకునే సెల్ఫీనే షేమ్‌లెస్‌ సెల్ఫీ. అయితే ఈ పదాన్ని ఎక్కువగా వాడే వాళ్లని నార్సిసిస్టిక్ (narcissistic) అని కూడా అంటారు. అంటే తమపై తమకే అతిగా ప్రేమ ఉండడం, గర్వం ఉండడం, పచ్చిగా చెప్పాలంటే వాళ్ల గురించి వాళ్లే హై రేంజ్‌లో డప్పు కొట్టుకోవడం అని అర్థం. హిట్లర్‌ లాంటి వాళ్లని ఈ పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెబుతారు. అటు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువగా ఉన్నవాళ్లు కూడా ఈ పదం వాడుతుంటారని ఈ వర్డ్‌ యూజ్‌ చేసేవాళ్లు చెప్పుకుంటారు. ఇలా ఎవరి వెర్షన్ వాళ్లకుంది. ఇక మోదీని ట్యాగ్‌ చేస్తూ టిమ్‌ బర్చెట్‌ ‘షేమ్‌లెస్‌’ వర్డ్‌ వాడడం పట్ల ఎలాంటి నెగిటివ్‌ మీనింగ్‌ లేదు. మోదీతో కలిసి ఫోటో దిగడానికి తానెమీ సిగ్గు పడటం లేదన్నది టిమ్‌ బర్చెట్ ట్వీట్ మీనింగ్! అంతేకానీ అది మన ఇండియాలో వాడే ‘షేమ్‌లెస్‌’ టైప్‌ తిట్టు కాదు. టిమ్‌ బర్చెట్ అనేక సందర్భాల్లో, వివిధ దేశాధినేతలతో దిగిన సెల్ఫీలలోనూ ఇదే పదం వాడినట్టు ఆయన పాత పోస్టులు చూస్తే అర్థమవుతుంది.