American World Tour: ఒక్క విమానం పాస్ ద్వారా 100 దేశాలు తిరిగి.. భార్యను 120 సార్లు హనీమూన్ కి తీసుకెళ్ళిన ఘనుడు
సాధారణంగా మనం ఫ్లైట్ జర్నీ అంటే ఇష్టపడినప్పటికీ ఖర్చును చూసి వెనక్కి తగ్గుతాం. అందులోనూ వివిధ దేశాల ప్రయాణం అయితే అస్సలు అడుగు ముందుకు వెయ్యం. ఎందుకంటే వీటి టికెట్ ధర విమానానికంటే ముందుగా ఆకాశాన్నంటుతుంది. అలాంటిది న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేయకుండా దాదాపు 100 దేశాలు తిరిగి తన భావనను ఇలా చెప్పుకొచ్చారు.

American Tom Stucker, who took his wife to honeymoon 120 times, returned to 100 countries through a single plane pass
దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం టామ్ స్టకర్ తీసుకున్న నిర్ణయం అతనిని ప్రపంచ దేశాలు మొత్తం చాలా తక్కువ ఖర్చుతో చుట్టేలా చూసింది. అమెరికా కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ 1990 లో విన్నూత్నమైన విమాన పాస్ ఆఫర్ ను ప్రకటించింది. దీని సారాంశం ఏమిటంటే 2.9 లక్షల డాలర్లు చెల్లించి అప్పట్లో విమాన పాస్ కొనుగోలు చేస్తే జీవితకాలం పాటూ ఎలాంటి ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేయకుండా విమానాల్లో ప్రయాణించవచ్చు అని తెలిపింది. మనోడు తెలివిగా ఆలోచింది దీనిని కొనుగోలు చేశాడు.
ఈ టికెట్ ను కొన్న మొదటి రోజు నుంచే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 3.7 కోట్ల కిలోమీటర్లు గగనతలం పై ప్రయాణం చేశాడు. అందులో భాగంగా 100 కు పైగా దేశాలను సందర్శించారు. ఇలా జర్నీ చేస్తున్న సందర్భంగా కొన్ని ఆఫర్లు, కూపన్లు లభించాయి. ఈ గిఫ్ట్ హాంపర్ల ద్వారా తన భార్యను కూడా ఫ్లైట్ ఎక్కించినట్లు తెలిపాడు. ఈ జర్నీలో మరో కొసమెరుపేమిటంటే కేవలం గిఫ్ట్ కార్డులు, పాయింట్స్ ద్వారా తన భార్యను 120 సార్లు హనీమూన్ కి పిలుచుకొని వెళ్ళడం మరింత ఆసక్తికలిగించే అంశం. ఇలాంటి వారు కూడా ఉంటారా ప్రపంచంలో అని టామ్ స్టకర్ ని చూస్తే అర్థం అవుతుంది. ఇన్ని దేశాలకు స్వయంగా టికెట్ కొనుగోలు చేసి వెళ్ళాలంటే దాదాపు 24 లక్షల డాలర్లు ఖర్చు అయ్యేదని చెప్పుకొచ్చారు. అలాంటిది అమెరికన్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఇలా వినియోగించుకుంటున్నాడు ఈ మహా మేధావి.
T.V.SRIKAR