Amit Shah Election campaign : నేడు తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం..
సార్వత్రిక ఎన్నికల (General Elections) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

Amit Shah election campaign in Telugu states today..
సార్వత్రిక ఎన్నికల (General Elections) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలోని ధర్మవరం, తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు.
ఇవాళ బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో ఏపీలోని ధర్మవరానికి అమిత్ షా చేరుకుంటారు.
ధర్మవరం బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ (Satyakumar) తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. అనంతరం రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి ప్రచార సభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాగజ్ నగర్ ఏర్పాటు చేసిన బీజేపీ సభలో పాల్గొననున్నారు. ఇక్కడ జరిగే సభలో అమిత్ షాతో పాటు చంద్రబాబు కూడా పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు నిజామాబాద్ లో బీజేపీ సభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6గంటలకు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు అమిత్ షా (Amit Shah) హాజరవుతారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. రాత్రి 7.30గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) ఎన్నికల ప్రచార సభలకు అమిత్ షా హాజరుకానున్నారు.
అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కూడా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. జమ్మలమడుగు, ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.
SSM