Amit Shah Tour : నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. ఒకే రోజు 3 సభలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల..!
అమిత్ షా ప్రర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. కేంద్రహోమంత్రి శుక్రవారం రాత్రికే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. కాగా ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో.. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ కి చేరుకుంటారు. ఒకే రోజు 3 సభలు.. సాయంత్రం హోటల్ కత్రియలో 6.10 గంటలకు బీజేపీ మేనఫెస్టో (BJP Manifesto) ను విడుదల

Amit Shah's visit to Telangana today.. 3 meetings in one day.. BJP manifesto released..!
తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) ఇప్పుడిప్పుడే కొంచెం బుల్లెట్ ట్రైన్ వాలే దూసుకెళ్తున్నాయి. కొన్ని రోజుల ముందు వరకు అధికార పార్టీ ఒక్క బీఆర్ఎస్ లో మరేక్కడా ఎన్నికల ప్రచారం కనిపించలేదు. ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ లో కొంత మేర జోష్ పెంచింది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా టాప్ గేర్ వేసే ఈక మా వంతు అంటూ రంగంలోకి దిగుతుంది జాతీయ పార్టీ బీజేపీ (BJP) . ఇప్పటికే రాష్ట్ర నేతలు పర్యటనలు చేస్తుండగా.. ఇక అగ్రనేతలు కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇవాళ ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాతోనే ఎన్నికల ప్రచారం జరిపించేందుకు తెలంగాణ దంగలోకి దిగుతున్నారు. ఇవాళ అమిత్ షా (Amit Shah) గద్వాల, నల్లగొండ, తూర్పు వరంగల్.. ఈ మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే సకల జనుల సంకల్ప సభల్లో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ఇంతకు ముందు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడిన వేళ.. ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది కాషాయదళం. ఇందులో భాగంగా.. ఇవాళ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
ఒకే రోజు 3 సభలు..
అమిత్ షా ప్రర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. కేంద్రహోమంత్రి శుక్రవారం రాత్రికే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. కాగా ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో.. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం లోపు 1.35 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగసభలో పాల్గొంటారు అమిత్ షా.
ఇది కూడా చదవండి : Andhra Pradesh, Cyclone : ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచనలు..?
ఆ తరువాత మధ్యాహ్నం 3.35 గంటలకు నల్లగొండ సభలో పాల్గొంటారు అమిత్‌షా. సాయంత్రం 4.20 గంటలకు తూర్పు వరంగల్ చేరుకుని అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం వరంగల్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం హోటల్ కత్రియలో 6.10 గంటలకు బీజేపీ మేనఫెస్టో (BJP Manifesto) ను విడుదల చేస్తారు. సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
S.SURESH