Telangana Elections : తెలంగాణలో అమిత్ షా సుడిగాలి పర్యటనలు..
తెలంగాణ ఎన్నికలకు మరో ఆరు రోజులే మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. తెలంగాణలో గెలుపు లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా బీజేపీ శుక్ర, శని, ఆదివారాల్లో అమిత్ షా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.

Amit Shah's whirlwind tours in Telangana
తెలంగాణ ఎన్నికలకు మరో ఆరు రోజులే మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. తెలంగాణలో గెలుపు లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా బీజేపీ శుక్ర, శని, ఆదివారాల్లో అమిత్ షా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో షా ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.
Priyanka Gandhi : నేడు రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన.. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
రేపు కొల్లాపూర్, మునుగోడు, పటాన్‌చెరులో సకల జనుల సంకల్ప సభల్లో పాల్గొననున్నారు. 26న మక్తల్, ములుగు, భువనగిరి, కూకట్‌పల్లిలో రోడ్ షోలో పాల్గొననున్నారు. అమిత్ షాతోపాటు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉదయం 11 గంటలకు మేడ్చల్‌లో, సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గంలో.. తర్వాత 5 గంటలకు కంటోన్మెంట్లో జరగనున్న బహిరంగ సభలలో పాల్గొననున్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు హుజూర్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్‌లో జేపీ నడ్డా రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలు ప్రాంతాల్లో ముఖ్య నేతలు ప్రాచారాలు నిర్వహించనున్నారు.