Amith Sha: విశాఖకు అమిత్‌షా, నడ్డా.. పొత్తులపై క్లారిటీ ఇస్తారా..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల విషయంలో భారీ ట్విస్టులు చోటుచేసుకుంటన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓట్‌బ్యాంక్ చీలనివ్వబోనంటూ జనసేనాని నేరుగానే చెప్తున్నారు. టీడీపీని, బీజేపీని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు శాయశక్తులా పని చేస్తున్నారు.
ఇంత హాట్ సిచ్యువేషన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విశాఖకు రానున్నారు. దీంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ, జనసేన సిద్ధంగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు నో అంటోంది. జనసేనతో మాత్రం కలిసి నడుస్తామని చెప్తోంది. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం రెండు పార్టీలను ఒక్కటి చేసి కూటమిగా పోటీ సేచేందుకు ప్రయత్నిస్తున్నాడు.
రీసెంట్‌గానే ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డాతో కూడా ఇదే విషయం మాట్లాడి వచ్చాడు. దీంతో ఇప్పుడు విశాఖ పర్యటనలో అమిత్ షా, జేపీ నడ్డా పొత్తుల గురించి ఎలాంటి ప్రకటన చేస్తారో అనే అశం ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ టీడీపీతో కలవకుండా జగన్ ఢిల్లీ నుంచి కాయిన్స్ మూవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య ఆయన ఎక్కువగా ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వంతో మంచి అనుబంధం కొనసాగిస్తున్నారు.
ఇలాంటి సిచ్యువేషన్‌లో వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రకటన చేస్తుందా అనేది కూడా కీలకంగా మారింది. పేరుకు దూరంగా ఉంటామని చెప్తున్నా.. నిజానికి ఏపీలో బీజేపీ సిచ్యువేషన్ అంతా బాగా లేదు. ఆ పార్టీకి క్యాడర్, లీడర్ ఇద్దరూ కరువయ్యారు. ఎవరో ఒకరితో కలిసి పోటీకి దిగితే తప్ప ఎన్నికల్లో నిలదిక్కుకునే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో బీజేపీకే పొత్తులు ఎక్కువ అవసరం. ఇదే విషయాన్ని బీజేపీకి అర్థమయ్యేలా చెప్పే పనిలో ఉన్నాడు జనసేనాని. కానీ బీజేపీ మాత్రం జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని క్లియర్‌గా చెప్తోంది. అయితే రానున్న ఎన్నికలు, వాస్తవ పరిస్థుతులను దృష్టిలో పెట్టుకుని అమిత్ షా, జేపీ నడ్డా ఎలాంటి ప్రకటణ చేస్తారో చూడాలి.