Pawan Kalyan : కలెక్టర్లలో పవర్‌స్టార్.. ఈ కృష్ణతేజ.. రికార్డులు చూస్తే గూస్‌బంప్స్.. పవన్ పేషీలోకి ఎంట్రీ..
హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేటుతో.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి.. తను గెలిచి, కూటమిని గెలిపించి.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్... పాలనపరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Among the collectors, Powerstar.. this Krishna Teja.. Goosebumps if you look at the records.. Pawan's entry into the field..
హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేటుతో.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి.. తను గెలిచి, కూటమిని గెలిపించి.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్… పాలనపరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలను తన పరిధిలో ఉంచుకున్న పవన్.. తనతో పాటు పనిచేసే అధికారుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ టీమ్‌లోకి మరో డైనమిక్ ఆఫీసర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేరళలోని అలెప్పీ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజ.. డిప్యుటేషన్ మీద ఏపీకి రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయ్. పవన్ టీమ్‌లో కృష్ణతేజ చేరితే.. మరిన్ని సంచలనాలు చూడడం ఖాయంగా కనిపిస్తోంది. కృష్ణతేజ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి! ఆపన్నులకు అండగా ఉంటూ.. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయే కృష్ణతేజ.. కేరళలో కలెక్టర్‌గా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. భయం.. తన బ్లడ్‌లోనే లేదు అన్నట్లుగా.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఎంత పెద్దవాళ్లు ఒత్తిడి తీసుకువచ్చినా.. వెనక్కి తగ్గలేదు.
కలెక్టర్ పవర్ ఏంటో చూపించారు. అలెప్పిలో రిసార్ట్ మాఫియాను తరిమికొట్టి.. తన పవర్ ఏంటో చూపించారు కృష్ణతేజ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2వందల కోట్ల విలువైన 54 విలాసవంతమైన అక్రమ విల్లాలను జేసీబీలతో కుప్పకూల్చారు. సరస్సును ఆక్రమించి ఇవన్నీ అక్రమంగా కట్టుకున్నవే. అలెప్పీ జిల్లాలో వెంబనాడ్ సరస్సు దగ్గర.. కపికో రిసార్టు చాలా ఫేమస్. ఐతే ఇందులోకి సామాన్యులకు నో ఎంట్రీ. మూడెకరాల దీవిలో కట్టుకుంటామని అనుమతులు తెచ్చుకొని.. అడిగేవాడు లేడని పదెకరాల్లో రిసార్టు కట్టేశారు నిర్వాహకులు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్యకారులను తొక్కి పడేశారు. ఐతే ఓ ఐదుగురు కుర్రాళ్లు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వారికి ప్రకృతి ప్రేమికులు తోడై… ఆ కట్టడాలు తొలగించేందుకు న్యాయస్థానం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. ఐతే అక్కడే అసలు సమస్య. కోర్డు అనుమతులు వచ్చాయ్ సరే.. అమలు చేసే అధికారి ఎవరా అని! అప్పుడొచ్చారు కృష్ణతేజ. ఆ ఐదుగురికి వేయి ఏనుగుల బలంగా కనిపించారు. నడిచొచ్చే నాలుగో సింహంలా అనిపించారు. అక్రమంగా నిర్మించిన 54విల్లాలను కుప్పకూల్చారు. ప్రభుత్వ సహకారంతో అలెప్పీలో రిసార్టు మాఫియాను తరిమికొట్టారు.
ఇక 2018 వరదల సమయంలో.. కృష్ణతేజ పడిన కష్టం.. కేరళ మాత్రమే కాదు.. దేశం కూడా ఎప్పటికీ మర్చిపోదు. ప్రతీ ప్రాంతం తిరుగుతూ.. మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేశారు. కొందరిని తానే స్వయంగా వరద నీటి నుంచి బయటకు తీసుకువచ్చారు. ది రియల్ హీరో అనిపించుకున్నారు. కృష్ణతేజకు కలెక్టర్ మామన్ అని కూడా పేరు. మామన్ అంటే మామ. సొంతమామలాగా వేలమంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపారు కృష్ణతేజ. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులకు.. సెలబ్రిటీల ద్వారా సాయం అందించారు. చిన్నారుల సంక్షేమం కోసం కృష్ణతేజ చేస్తున్న కృషికి.. జాతీయస్థాయిలో గుర్తింపు లభిచింది. కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు అందుకున్నారు కృష్ణతేజ. అలెప్పి పిల్లలకు.. కృష్ణతేజ ఓ హీరో. జనం దృష్టిలో సమర్థవంతమైన అధికారి. ఇవన్నీ పవన్ దృష్టికి వచ్చాయ్. అందుకే కావాలని పట్టుబట్టి మరీ.. తన పేషీలోకి పిలిపించుకున్నారు. కేంద్రానికి సమాచారం పంపారు. పవన్ మీద అభిమానంతో కేంద్రం కూడా ఈజీగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పుడు పవన్‌తో కలిస్తున్న కృష్ణతేజ.. ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో అనే చర్చ జరుగుతోంది. పవన్ చేతిలో కీలక శాఖలు ఉన్నాయ్. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరాలాంటివి ఉన్నాయ్. అవన్నీ కృష్ణతేజకు అప్పగించే అవకాశాలు ఉన్నాయ్. గ్రామాల్లో అవినీతి పేరుకుపోయిందని పవన్ పదేపదే అంటున్నారు. ఇప్పుడు కృష్ణతేజ అనే ఆయుధంలో.. ఆ అవినీతికి చెక్ పెట్టే చాన్స్ ఉంది. అన్యాయం జరిగుతోందనే సమాచారం వస్తే చాలు.. అక్కడ వాలిపోయే రకం కృష్ణతేజ. అలాంటి అధికారికి పవన్‌లాంటి తోడు ఉంటే ఆగుతారా.. చెలరేగిపోవడం ఖాయం. పవన్, కృష్ణ తేజ కాంబినేషన్ అంటే.. ఆగ్నికి ఆజ్యం తోడయినట్లే.. ఇది అవినీతిని అంతం చేయడం ఖాయం అంటూ.. పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.