8th class girl, Wayanad : కేరళ ప్రళయాన్ని ఏడాది క్రితమే పసిగట్టిన 8th క్లాస్ అమ్మాయి
కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad) లో వచ్చిన ప్రళయం ఓ యుద్ధానికి సమానమైన విషాదాన్ని మిగిల్చింది. వందల మందిని పొట్టన పెట్టుకుంది.
కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad) లో వచ్చిన ప్రళయం ఓ యుద్ధానికి సమానమైన విషాదాన్ని మిగిల్చింది. వందల మందిని పొట్టన పెట్టుకుంది. వేల కుటుంబాలను రోడ్డున పడేసింది. లక్షల మందిని దిక్కులేనివాళ్లను చేసింది. విరిగిపడ్డ కొండ చరియలు (Landslides) కప్పేసిన గ్రామాలను.. తవ్వుతున్నకొద్దీ శవాలు బయటకు వస్తున్నాయి. అర్థరాత్రి సమయంలో ఎవరూ ఊహించకుండా వచ్చిన ఈ ప్రమాదాన్ని లయ అనే ఓ 8th క్లాస్ అమ్మాయి సంవత్సరం క్రితమే గుర్తించింది.
ఇది కూడా చదవండి : Wayanad : వాయనాడ్ లో సినిమా సీన్, ఆరుగురు ప్రాణాలు కాపాడటం కోసం…
ఇదే ప్రళయాన్ని కథగా రాసింది. చురమరాల్ అనే గ్రామంలో 8th క్లాస్ చదువుతున్న లయ లాస్ట్ ఇయర్ (Laya Last Year) ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో పాల్గొంది. ఆ పోటీలో లయ ఈ ప్రళయం గురించి కథ రాసింది. ప్రకృతి ప్రకోపం (Nature Fury) గురించి క్లియర్‌గా వివరించింది. చురమరాల్‌లో ఓ అమ్మాయి వరదలో మునిగి చనిపోతుంది. అదే అమ్మాయి కొన్ని రోజులకు పక్షిగా జన్మించి అదే గ్రామానికి వస్తుంది. గ్రామంలో పెద్ద ప్రళయం రాబోతోందని.. అంతా పారిపోండి అంటూ స్కూల్ పిల్లలకు చెప్తుంది. ఆ పక్షి వాళ్లతో మాట్లాడుతుండగానే పెద్ద ప్రళయం చురమరాల్ (Churamaral) గ్రామాన్ని ముంచేస్తుంది. వాళ్లను కాపాడేందుకు ఎవరూ రారు. ఆ వరదలో అంతా కొట్టుకుపోయి చనిపోతారు. బురదలో శవాలు, ధ్వంసమైన ఇళ్లు తప్ప అక్కడ ఏం మిగలదు.
ఇది కూడా చదవండి : Kedarnath Yatra 2024 : కేదార్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. కేధార్నాథ్ ట్రెక్కింగ్ లో కొండచరియలు విరిగి ముగ్గురి మృతి
ఇది లయ రాసిన కథ.. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ గ్రామంలో కనిపిస్తున్న సీన్ ఇదే. ఎవరూ ఊహించని ఆ వరద రాత్రికి రాత్రే ఆ గ్రామాన్ని తుడిచేసింది. కాపాడేందుకు కూడా అవకాశం లేని స్థాయి గ్రామాన్ని మింగేసింది. ఇదే కథను లయ సంవత్సరం క్రితం రాసింది. ఈ కథే పోటీలో గెలవడంతో.. స్కూల్ మేగజైన్‌లో ఈ కథను ప్రింట్ వేశారు కూడా. కానీ బ్యాడ్‌లక్ ఏంటి అంటే.. ఈ కథ రాసిన తయ తండ్రి లెనిన్ రీసెంట్‌గా వచ్చిన వరదల్లో చనిపోయాడు. లయతో చదువుకున్న 32 మంది విద్యార్థులు కూడా చనిపోయారు. తన కథలో లయ చెప్పినట్టుగానే ఆ గ్రామంలో మృత్యువు తాండవం చేసింది. ఈ వరదల నేపథ్యంలో లయ రాసిన ఈ కథ ఇప్పుడు వైరల్ అవుతోంది.