Hyderabad, Nims : యువకుడి ఛాతిలో దిగిన బాణం.. హైదరాబాద్ NIMSలో ప్రాణదానం..
ప్రమాదవశాత్తు ఛాతీలో బాణం దిగిన యువకుడిని HYD నిమ్స్ డాక్టర్లు 3 గంటలు శ్రమించి రక్షించారు. ఛత్తీస్‌గడ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అడవి పందిని వేటాడేందుకు ఎవరో వేసిన బాణం ఛాతీలో దిగింది.
ప్రమాదవశాత్తు ఛాతీలో బాణం దిగిన యువకుడిని HYD నిమ్స్ డాక్టర్లు 3 గంటలు శ్రమించి రక్షించారు. ఛత్తీస్‌గడ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అడవి పందిని వేటాడేందుకు ఎవరో వేసిన బాణం ఛాతీలో దిగింది. భద్రాచలం ఆస్పత్రి, WGL MGM.. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్క తరలించారు. అక్కడ వైద్యులు తొలుత యువకుడికి సీటీ స్కాన్ చేశారు. ఊపిరితిత్తుల పక్కనుంచి గుండె కుడి కర్ణికలో బాణం గుచ్చుకోవడంతో భారీగా రక్తం పోయింది. మానవీయ కోణంలో వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేసి విజయవంతంగా బాణం తొలగించారు. కాగా ఆపరేషన్ చేసిన డాక్టర్ అమరేశ్వర రావు వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు.