Delhi Lover :గొడవపడ్డ ప్రేమికులు.. రోడ్డెక్కిన క్షమాపణలు.. షాకైన స్థానికులు..
నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వక పోవడం ఒక రోగం అనే మాట వినే ఉంటారు. కానీ ఈ ట్రెండ్ ఇప్పుడు మారింది. ప్రేమించడం ఒక యోగం, పెళ్లి చేసుకోవడం ఒక భోగం, కొట్లాడుకొని విడిపోవడం ఒక రోగం. విడిపోయిన తరువాత సారీ రాగం అందుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ క్షమాపణలు కాస్త నాలుగు వీధులకు తెలిసేలా చెప్పడం కాస్త ఆసక్తికరంగా మారింది.

Sush Sorry To His Girl Firend Sanju
సాధారణంగా సారీలు నాలుగు గొడల మధ్య చెప్పుకుంటారు. మరి కొందరైతే నలుగురు బంధుమిత్రలు మధ్య చెప్పుకుంటారు. కానీ ఇతగాడు ప్రపంచం మొత్తానికీ తెలిసేలా చెప్పాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఎవరు అతగాడు ఏం చేశాడో తెలుసుకుందాం.
ఢిల్లీ సమీపంలోని నోయిడాకు చెందిన యువకుడు తన ప్రేయసితో గొడవపడ్డాడు. తిరిగి తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగేందుకు విన్నూత్నంగా ప్రయత్నించాడు. ప్రదాన కూడలిలోని ఒ భారీ హోర్డింగ్ కు తన క్షమాపణలను ఇలా రాసుకొచ్చాడు. ‘అయామ్ సారీ సంజూ.. ఐ విల్ నెవర్ ఎవర్ హర్ట్ యూ అగైన్.. యువర్ సుష్’. అంటే నన్ను క్షమించు సంజూ.. ఇక పై ఎప్పుడూ నిన్ను కించపరచను.. నీ సుష్ అని తన భావనను వ్యక్తపరిచాడు. ఇంతటితో సరిపెట్టక దీనికి తన ఫోటోతో పాటూ ఆ ప్రేయసి చిన్ననాటి ఫోటోను కూడా జతచేశాడు. ఇలా పెద్ద ప్లెక్సీని సెంటర్లో ఏర్పాటు చేశాడు. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కి గురౌతున్నారు. తను చేసిన తప్పును గుర్తించి బాధపడ్డ ప్రేయసి మనసును తిరిగి పొందేందుకు ఇలా వెరైటీగా ప్లాన్ చేయడం చాలా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరైతే సంజూ.. సుష్ ని వదులుకోవద్దు చాలా మంచి వాడు అని ట్వీట్ చేస్తున్నారు.
In today’s episode of what the fuck goes on in Noida pic.twitter.com/cScEMdkZmE
— 🥭 🐭 (@uDasKapital) June 26, 2023
T.V.SRIKAR