BRS leaders : చివరి నిమిషంలో జంపింగ్స్.. బీఆర్ఎస్ నేతలు సేఫ్ జోన్ చూసుకుంటున్నారా..?
లెక్కేసి కొడితే వారం రోజులు కూడా లేవు ఎన్నికలకు ! సోమవారంతో ప్రచార గడువు ముగుస్తుంది కూడా ! ఒకరకంగా చెప్పాలంటే.. అసెంబ్లీ ఎన్నిలకు ఈ వారం రోజులు చివరి క్షణాల్లాంటివి. దీంతో ఈ సమయంలో.. సేఫ్ జోన్ చూసుసకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జంపింగ్ జపాంగ్ అంటున్నారు.
లెక్కేసి కొడితే వారం రోజులు కూడా లేవు ఎన్నికలకు ! సోమవారంతో ప్రచార గడువు ముగుస్తుంది కూడా ! ఒకరకంగా చెప్పాలంటే.. అసెంబ్లీ ఎన్నిలకు ఈ వారం రోజులు చివరి క్షణాల్లాంటివి. దీంతో ఈ సమయంలో.. సేఫ్ జోన్ చూసుసకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జంపింగ్ జపాంగ్ అంటున్నారు. మాములుగా వలసలు ఎన్నికలకు నెలరోజుల ముందే.. 15రోజుల ముందే కనిపిస్తాయ్. ఇలా పోలింగ్‌కు వారం రోజుల ముందు.. ఓ నాయకుడు జంపింగ్ చేస్తున్నారు అంటే.. తాను ఉన్న పార్టీ భవిష్యత్ అర్థం అయిందా.. అందుకే ఇలా చేస్తున్నారా అనే అనుమానం రాకుండా ఉండదు. ఆలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను.. బీఆర్ఎస్ ఈసారి పక్కనపెట్టింది. ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు ఖరారు చేసినా.. ఆ తర్వాత ఆయనను మారుస్తూ కారు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
దీంతో ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అబ్రహం మాత్రమే కాదు.. సీనియర్ నేత మండవ వెంకటేశ్వర్లుది కూడా ఇదే దారి. ఐతే ఇన్ని రోజులు బీఆర్ఎస్‌లోనే ఉండి.. చివరి క్షణాల్లో ఎందుకు కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారనేది చర్చకు దారి తీస్తోంది. టికెట్ రాకపోతే.. అసంతృప్తితో అయినా పార్టీ మారాలి, లేదంటే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని అయినా మారాలి.. ఇదీ కాదంటే వేరే పదవి ఇవ్వడం లేదు అని హర్ట్ అయినా పార్టీ మారాలి. ఇవేవీ కాకుండా కొన్ని రోజులు పార్టీలో ఉండి.. చివరి క్షణాల్లో వేరే పార్టీలోకి జంప్ అవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. రాజకీయ నాయకుడు ఒక అడుగు వేశాడంటే.. చాలా పెద్ద స్కెచ్ ఉంటుంది. అలాంటిది పోలింగ్‌కు వారం రోజుల ముందు పార్టీ మారుతున్నారంటే.. ఇంకా ఏదో పెద్దగానే ప్లాన్ చేసి ఉంటారని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఐతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఇలా చివరి క్షణాల్లో పార్టీ మార్పులపై.. మరో రకమైన చర్చ కూడా సాగుతోంది. కారుకు ఈసారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. అందుకే ఆ పార్టీలో ఉండడం కంటే అధికారంలోకి రాబోయే పార్టీలోకి వెళ్తే బెటర్ అని డిసైడ్ అయి.. జంపింగ్ చేస్తున్నారని మరికొందరి వాదన. ఎవరి సేఫ్టీ వారిది బాస్ అన్నట్లుగా వారి తీరు కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది. మరి ఇవే అంచనాలు నిజం అవుతాయా.. నిజంగా కారు ఝలక్ తగిలి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అంటే.. డిసెంబర్ 3వరకు ఎదురుచూడాల్సిందే..