Anant, Radhika Wedding : ప్రమాణం చేసి చెప్తున్నా.. రాధికాకు అనంత్ స్పెషల్ ప్రామిస్..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి చేసుకున్నారు. జూలై 12న ఓ శుభముహూర్తాన.. ఇద్దరు కలిసి ఒక జీవితం మొదలుపెట్టారు.

Anant Ambani and Radhika Merchant got married. On an auspicious day on July 12.. the two started a life together.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి చేసుకున్నారు. జూలై 12న ఓ శుభముహూర్తాన.. ఇద్దరు కలిసి ఒక జీవితం మొదలుపెట్టారు. పెళ్లి వేళ అంబానీ కుటుంబం ధరించిన వస్త్రాలు, ఆభరణాలు, పెళ్లి మండపం డిజైన్‌లపై ఆసక్తికర చర్చ జరిగింది. అత్యంత ఖరీదైన డిజైనర్ పెళ్లి దుస్తులు, ఆభరణాలు ధరించిన రాధికా మర్చంట్ యువరాణిలా మెరిసిపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో.. ఎంతో వైభవంగా ముత్యాల పందిరిలో వేదమంత్రాల సాక్షిగా అనంత్, రాధిక పరిణయం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో నూతన వధూవరులు ఒకరికొకరు ప్రత్యేక వాగ్దానం చేశారు. పెళ్లి జరిగిన తర్వాత అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌లు మండపం దగ్గర నిలబడి ప్రత్యేకంగా వ్రాసిన ప్రతిజ్ఞలను మార్పిడి చేసుకున్నారు.
తాను అడుగుపెట్టబోయే ఇల్లు సురక్షితమైన స్థలంగా ఉంటుందని, ప్రేమ సఖ్యతతో నిండి ఉంటుందని రాధిక వాగ్దానం చేయగా.. తన భార్యతో కలిసి కలల ఇంటిని నిర్మిస్తానని అనంత్ హామీ ఇచ్చాడు. మన ఇల్లు ఒక స్థలం మాత్రమే కాదు.. అది మన ప్రేమ, ఐక్యతలకు నిలయంగా ఉంటుంది. మనం కలిసే ఉంటాం అంటూ రాధిక భావోద్వేగంగా ప్రకటించగా.. అందుకు అనంత్ అంబానీ బదులిస్తూ.. రాధికా.. ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడు ఉంటుంది. మనం నివసించబోయే ఇల్లు కేవలం స్థలం మాత్రమే కాదు.. మనం ఎక్కడ ఉన్నా అది ప్రేమ, ఆప్యాయతల కలయిగా ఉంటుంది. నీతో కలిసి కలల ఇంటిని నిర్మిస్తాను అంటూ రాధికకు మాటిచ్చాడు అనంత్. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే ముందు.. ఈ దంపతులు ఒకరికొకరు ప్రత్యేక ప్రమాణాలు చేసుకుని.. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. కుమారుడి పెళ్లి సందర్భంగా ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యాడు.