Anant Ambani: అనంత్‌, రాధికా క్యూట్‌ లవ్‌స్టోరీ.. సినిమా తీసేయొచ్చు..

నిజానికి అంబానీల ఇంటికి రాధికా మర్చంట్‌ కోడలు కాబోతోందంటూ కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. మర్చంట్‌ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయ్. ఇదే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ మధ్య ప్రేమకు దారి తీసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2024 | 07:34 PMLast Updated on: Mar 04, 2024 | 7:34 PM

Anant Ambani And Radhika Merchant Love Story Interesting Here Is The Story

Anant Ambani: ఇప్పుడు దేశమంతా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ పేరే వినిపిస్తోంది. వీరి పెళ్లి గురించే దేశమంతా చర్చించుకుంటోంది. వివిధ దేశాల నుంచి ప్రముఖులు రావడం.. బాలీవుడ్‌ సెలబ్రిటీల ఆటపాటలతో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రీవెడ్డింగ్‌ ఆ రేంజ్‌లో జరిగింది. ముందస్తు వేడుకలే ఇలా ఉంటే.. పెళ్లి ఏ స్థాయిలో ఉంటుందో అంటూ.. ఎవరికి వారు అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టేశారు. పనిలో పనిగా అంబానీల ఇంటికొస్తున్న ఈ చిన్న కోడలెవరోనని ఆరా తీయడం కూడా స్టార్ట్‌ చేశారు.

Prashant Kishor: నిన్ను నమ్మలేం బాస్‌.. ప్రశాంత్‌ కిషోర్‌ మాటలు జనం నమ్ముతారా..?

నిజానికి అంబానీల ఇంటికి రాధికా మర్చంట్‌ కోడలు కాబోతోందంటూ కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. మర్చంట్‌ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయ్. ఇదే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ మధ్య ప్రేమకు దారి తీసింది. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నా.. విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చారు. 2018లో ఇషా అంబానీ, ఆనంద్‌ పిరమల్‌ వివాహ వేడుక టైమ్‌లోనే రాధిక పేరు వినిపించింది. 2019లో ఆకాశ్‌, శ్లోక పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం. ప్రతీ వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, సంగీత్‌ వేడుకలో అనంత్‌కు జంటగా డ్యాన్స్‌ చేయడం, ఫ్యామిలీ ఫొటోల్లోనూ కనిపించడంతో నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలంటూ ప్రచారం జరిగింది. ఇక అనంత్‌, రాధిక కలిసి దిగిన కొన్ని ఫొటోలు కూడా అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయ్. 2022లో అధికారికంగా రెండు కుటుంబాలు వీళ్ల పెళ్లిని కన్ఫార్మ్ చేశాయ్‌.

2023 జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జులైలో వివాహం జరగనుంది. రాధిక మర్చంట్‌ తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో అనంత్‌ అంబానీ అన్నారు. రాధికను చూస్తే తనలో తుపాను, సునామీ మొదలవుతుందని చెప్పాడు. గడిచిన ఏడేళ్లుగా రాధిక తనతో ఉన్నా.. రోజూ చూస్తున్నా.. నిన్ననే చూసినట్లు ఉంటుందంటూ.. తన మనసులో ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పాడు అనంత్‌.