Anant Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. గెస్టుల లిస్టు చూస్తే కళ్ళు తిరుగుతయ్..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్ళి సందడి మొదలైంది. చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి కోసం ఏర్పాట్లు ధూమ్ ధామ్ గా సాగుతున్నయ్. వీళ్ళ ప్రీ వెడ్డింగ్ వేడుకలను గుజరాత్‌లోని జామ్ నగర్‌లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

Anant Ambani Pre Wedding: ముకేష్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కు హాజరయ్యే గెస్టుల పేర్లు చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. జుకర్‌బర్గ్, బిల్‌గేట్స్ లాంటి వాల్డ్ ఫేమస్ గెస్టులు వస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్ళి సందడి మొదలైంది. చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి కోసం ఏర్పాట్లు ధూమ్ ధామ్ గా సాగుతున్నయ్. వీళ్ళ ప్రీ వెడ్డింగ్ వేడుకలను గుజరాత్‌లోని జామ్ నగర్‌లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
TRISHA ARREST: టీవీ యాంకర్‌ను కిడ్నాప్ చేసిన త్రిష.. పెళ్లి కోసం ఒత్తిడి.. చివరకు..
మార్చి 1-3 తేదీల్లో జామ్‌నగర్‌లోని రిలయన్స్ కాంప్లెక్స్‌లో 3 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ వేడుకలకు వాల్డ్ ఫేమస్ గెస్టుల దగ్గర నుంచి బాలీవుడ్ స్టార్స్ దాకా ఇంకా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. META CEO మార్క్ జుకర్ బర్గ్, MICROSOFT సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అడోబ్ CEO శంతను నారాయణ్ లాంటి ప్రముఖులు కూడా అటెండ్ అవుతున్నారు. ఇంకా బ్లాక్‌రాక్ CEO ల్యారీ పింక్, బ్లాక్‌స్టోన్ ఛైర్మన్, డిస్నీ సీఈఓ.. ఇంకా ఇవాంకా ట్రంప్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్‌థాని పెళ్ళి వేడుకల్లో పాల్గొంటారు. మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బెర్క్‌షైర్ హాథ్‌వే లాంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, కెనడా, స్వీడన్, ఆస్ట్రేలియా, బొలీవియా దేశాల మాజీ ప్రధానులు, భూటాన్ రాజు, రాణి కూడా ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కు హాజరవుతారు. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు వచ్చే ఈ గెస్టులకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
గుజరాత్‌లోని లాల్‌పుర్, కచ్‌లో మహిళలు తయారు చేసిన కండువాలు సిద్ధం చేశారు. అలాగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భారతీయ సంస్కృతిని… ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు చూపించాలని అంబానీ ఫ్యామిలీ ఆలోచిస్తోంది. ముంబై, ఢిల్లీ నుంచి జామ్నగర్కు గెస్టులు రావడానికి ఛార్టెడ్ విమానాలను రెడీ చేస్తున్నారు. హెయిర్ స్టైలింగ్, చీర డ్రాపింగ్, మేకప్కు కూడా ఏర్పాట్లు చేశారు. ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, మరో ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ నిశ్చితార్థం గతేడాది జనవరిలో జరిగింది. ఈ మధ్యే లగన్ లఖ్‌వనూ వేడుక కూడా చేశాయి అంబానీ, మర్చంట్ కుటుంబాలు.