Anantha Sriram : రైటర్ సాహసం.. మనిషినా.. గాలి పటాన్నా..
అనంత శ్రీరామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అతి తక్కువ టైంలోనే సినీ గేయ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడీ యువ రైటర్... స్టార్ హీరోల సినిమాల్లో అనంత శ్రీరామ్ రాసిన పలు సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి.

Anantha Sriram.. There is no Telugu moviegoer who does not know this name.
అనంత శ్రీరామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అతి తక్కువ టైంలోనే సినీ గేయ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడీ యువ రైటర్… స్టార్ హీరోల సినిమాల్లో అనంత శ్రీరామ్ రాసిన పలు సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఆయన పాపులర్ లిరిక్ రైటర్‌గా మాంచి ఫేమస్ అయిపోయాడు అనంత శ్రీరామ్..
ఎన్నో అద్భుతమైన తెలుగు పదాలను ఎంతో అర్థవంతంగా పాటల రూపంలో రాస్తూ ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన రచయితగా.. అనంత శ్రీరామ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది.. అందుకే.. సీనియర్ రైటర్లతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటాడీ టాలెంటెడ్ రైటర్..
ఇక.. ప్రతిభ ఉన్న రచయిత కావడంతో అనంత శ్రీరామ్ ఎక్కువగా తన పాటలో తెలుగు పదాలను ఉపయోగిస్తుంటాడు.. ఈ క్రమంలోనే కొందరు ఈయనపై పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పటికీ.. ఆయన పాటలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు హృదయాలకు మాత్రం ఎంతో దగ్గరయ్యాయి.. ఇక.. పాటలతో మాత్రమే కాకుండా.. వివాదాలతో కూడా అనంత శ్రీరామ్ కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు.. ఈ క్రమంలోనే రీసెంట్‌గా మరోసారి న్యూస్‌లో హాట్‌టాపిక్ అయ్యాడు అనంత శ్రీరామ్… అయితే.. ఈసారి వివాదంతో సావాసం చేసి కాకుండా.. సాహసం చేసి వార్తల్లోకెక్కాడు అనంత శ్రీరామ్..
అవును.. చాలా మంది ఎంతో కష్టసాధ్యంగా భావించే బంగీ జంప్‌ను అత్యంత సాహసంగా చేశాడు అనంత శ్రీరామ్.. లడఖ్‌లో పర్యటించిన ఆయన ఆయన జన్స్కార్ నదిపై 10,500 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకి సాహసం చేశారు. దాదాపు 192 అడుగుల వరకు లోయలో ఆయన కాసేపు కిందకు వేలాడుతూ బంగీ జంప్ పూర్తి చేశారు.. ఆ సాహసం పూర్తి చేసిన తర్వాత తాను మనిషినా? గాలి పటాన్నా ? అనే అనుభూతి కలిగిందంటూ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని పొంది తీరాలంటూ తన అనుభూతిని పంచుకున్నారు.. అనంత శ్రీరామ్ చేసిన ఈ సాహసంతోపాటు ఆయన చేసిన ఈ కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
View this post on Instagram