Anasuya Bharadwaj: పవన్‌కి సపోర్ట్.. పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా.. యాంకర్ అనసూయ
పార్టీలతో పనిలేకుండా మాట్లాడాలంటే పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడు అంటోంది యాంకర్ అనసూయ. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తానంది. జబర్దస్త్‌లో రోజా, నాగబాబుతో పనిచేశాను.. ఇద్దరూ క్లోజ్.. ఒకవేళ ఇద్దరూ తమ పార్టీల్లోకి పిలిస్తే.. తాను మాత్రం మంచి నాయకుడినే ఎంచుకుంటానన్నారు.

Anasuya Bharadwaj: ఏపీలో జనసేన తరపున ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నట్టు యాంకర్ అనసూయ చెప్పారు. పవన్ కల్యాణ్ పిలిస్తే వెళతానని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సొసైటీలో సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ.. అలాంటి సొసైటీలో ఉంటున్న నాకు ఓ మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఉందన్నారు. తాను చెబితే వినేవాళ్ళు ఉండటం అదృష్టమన్నారు అనసూయ.
Ram Charan: చెర్రీ పుట్టినరోజున పవన్ ఎమోషనల్ మెసేజ్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే..
పార్టీలతో పనిలేకుండా మాట్లాడాలంటే పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడు అంటోంది యాంకర్ అనసూయ. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తానంది. జబర్దస్త్‌లో రోజా, నాగబాబుతో పనిచేశాను.. ఇద్దరూ క్లోజ్.. ఒకవేళ ఇద్దరూ తమ పార్టీల్లోకి పిలిస్తే.. తాను మాత్రం మంచి నాయకుడినే ఎంచుకుంటానన్నారు. అన్ని పార్టీల్లో లీడర్లు తనకు తెలుసంటోంది అనసూయ. పవన్ కల్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. అలాంటి వారిని ఎన్నుకోమని తాను వేరే వాళ్ళకి చెబుతాననీ.. వాళ్ళు వినడం తన అదృష్టం అంటోంది అనసూయ.
వింటున్నారని కదా అని ఏది పడితే అది చెప్పను అన్నది. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదన్నది యాంకర్ అనసూయ. తన నాన్న పాలిటిక్స్‌లో ఉండేవారనీ.. ఆయన రాజకీయాలు మానేయడానికి కూడా తానే కారణమని చెప్పింది.