Actress Rohini : హేమను వెక్కిరిస్తున్న రోహిణి..! కొత్త రచ్చ
యాంకర్, నటి రోహిణి.. డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికింది. నిజంగా కాదులేండి.. ఓ మూవీ టీజర్‌లో! ది బర్త్‌డే బాయ్ అనే పేరుతో ఓ సినిమా వస్తోంది.

Anchor and actress Rohini.. found by the police in a drug case. Not really.. in a movie teaser!
యాంకర్, నటి రోహిణి.. డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికింది. నిజంగా కాదులేండి.. ఓ మూవీ టీజర్‌లో! ది బర్త్‌డే బాయ్ అనే పేరుతో ఓ సినిమా వస్తోంది. దానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో రిలీజ్ అయింది. ఏదో చిన్న సినిమా.. పది మందికి చేరువ చేయాలని.. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కాస్త ప్రమోషన్‌లు గట్టిగా చేస్తున్నారు. ఐతే ఈ మధ్యే డ్రగ్స్ కేసులో చిక్కుకున్న హేమ ఇష్యూనుకూడా మూవీ టీమ్ గట్టిగానే వాడేస్తోంది. ఈ వీడియోలో రోహిణి చింపి ఆరేసింది అంతే. రోహిణి కనిపించింది హేమ పాత్రలోనే అని ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. టీజర్ ఓపెన్ చేస్తే.. ఎవరిదో బర్త్‌డే పార్టీకి రోహిణి వెళ్తుంది.
అక్కడికి పోలీసులు వస్తారు, ఇది రేవ్ పార్టీ, నువ్వు కూడా బండెక్కు, నడువ్ స్టేషన్‌కు అని దబాయిస్తారు. అయ్యో, బర్త్‌డే పార్టీ అంటే వచ్చాను, టెస్టులు చేయలేదు, పాజిటివ్ కూడా రాలేదు అని అంటుంది పోలీసులతో… ఇక్కడ వచ్చింది అసలు సమస్య. ఇదంతా నటి హేమను వెక్కిరిస్తూ తమ సినిమా ప్రమోషన్ కోసం తీసిన వీడియో అనీ.. అందులో రోహిణి నటించి తప్పు చేసిందంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు కొందరు. నిజానికి ఆ మూవీ టీమ్ కోరుకుంది కూడా అదే కావొచ్చు బహుశా. ఐతే మరికొందరు మాత్రం ఆ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.
హేమను పోలిన పాత్రే అనుకున్నా.. అందులో తప్పేముంది అని కొట్టిపారేస్తున్నారు. వీడియోలు, వివాదం కథలుకథలుగా మీడియాలో వచ్చినవే కదా… ఇంకా ఎందుకు దాపరికం… ఆ వార్తల్లో నుంచి తమ సినిమాకు ఓ ప్రమోషనల్ వీడియో చేసుకుంటే హేమకు కొత్తగా వచ్చిన పరువు నష్టం ఏమిటి అంటూ లాజిక్‌లు తీస్తున్నారు. హిందీలో, ఇతర భాషల్లో సెటైరికల్ వీడియోలు, స్కిట్స్ బోలెడు… ఐతే తెలుగులోనే ఇలాంటి కాస్త తక్కువ. ఇప్పుడు రోహిణికి ఎదురైన అనుభవాలే.. చాలామందిని పలకరించాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. అది హేమ పాత్రనా కాదా అన్న సంగతి ఎలా ఉన్నా.. రోహిణి మాత్రం ఆ కేరక్టర్‌లో జీవించిపోయింది.