AP SSC Tenth Exam Schedule : ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్ష తేదీలు విడుదల..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024లో పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు విడుదల చేసింది. ఏపీలో వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. విద్యాశాఖ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.

Andhra Pradesh Government has released 10th Class and Inter Exam Dates 2024.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024లో పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు విడుదల చేసింది. ఏపీలో వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. విద్యాశాఖ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ మేరుకు ఏపీలో మార్చి 18 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 25 వరకు థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 15 వరకు ఉంటాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ వివరించారు.
ఏపీ SSC టెన్త్ పరీక్షల షెడ్యూల్..
- పరీక్షతేదీ సబ్జెక్టు
- మార్చ్ 18 లాంగ్వేజ్ పేపర్-1
- మార్చ్ 19 సెకండ్ లాంగ్వేజ్
- మార్చ్ 20 ఇంగ్లీష్
- మార్చ్ 22 మాథ్స్
- మార్చ్ 23 ఫిజికల్ సైన్స్
- మార్చ్ 26 బయాలజీ
- మార్చ్ 27 సోషల్ స్టడీస్
- మార్చ్ 28 మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
- మార్చ్ 30 ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష
కాగా టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా.. 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. 6 లక్షల మంది టెన్త్ పరీక్షలను, 10 లక్షల మంది ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలను రాయబొతున్నారు. ఒకటే రోజు మొదటి, ద్వితీయ సంవత్సర ఇంటర్ పరీక్షలు ఉండవని.. ఆల్ట్రర్ నేట్ డేస్ లో జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు.