Anil Ambani: అయ్యో అనిల్.. బ్యాగులు మోస్తూ.. దూరందూరంగా.. అన్నకొడుకు పెళ్లిలో అనామకుడిలా అనిల్..
అందరు అతిథుల్లాగే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు.. ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు అనిల్. తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అన్షుల్‌తో కలిసి అనామకుడిలా ఎంట్రీ ఇవ్వగా.. ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
Anil Ambani: ఇప్పుడు దేశం మొత్తం అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటోంది. వాల్డ్‌వైడ్‌గా సెలబ్రిటీస్ అంతా కేరాఫ్ జామ్‌నగర్ అంటున్నారు. ఈ పెళ్లి గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి.. చరిత్ర గుర్తుంచుకోవాలి అనే రేంజ్‌లో కొడుకు వివాహం జరిపిస్తున్నాడు ముఖేష్ అంబానీ. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్, ధోనీ, బాలీవుడ్ ప్రముఖులు షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్ సహా ఇంకెందరో హాజరయ్యారు. ఐతే ముఖేష్ సొంత తమ్ముడు.. అనిల్ అంబానీ పరాయివ్యక్తిలానే పెళ్లిలో కనిపించాడు.
Pat Cummins: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్.. మార్క్‌రమ్ స్థానంలో కమ్మిన్స్‌కు సారథ్య బాధ్యతలు
అందరు అతిథుల్లాగే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు.. ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు అనిల్. తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అన్షుల్‌తో కలిసి అనామకుడిలా ఎంట్రీ ఇవ్వగా.. ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా సాధారణంగానే ఉంది. వారి కుటుంబం అంతా వారి వారి బ్యాగులు మోసుకుంటూ వెళ్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ వారిని ఫొటోలు తీసేందుకు కూడా ఫొటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం హైలైట్. ఐతే ప్రతీ అతిథిని దగ్గరుండి పలకరించిన ముఖేష్ అంబానీ.. తమ్ముడిని పలకరించిన ఒక్క వీడియో కూడా బయట కనిపించకపోవడం మరో ట్విస్ట్. అందరు సెలబ్రిటీల వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటే.. అనిల్ అంబానీ వచ్చిన ఫుటేజీ తప్ప.. వేరే ఏదీ కనిపించడం లేదు. ముఖేష్ ఇంట్లో ఇది ఒకరకంగా చివరి పెళ్లి. అందుకే ఘనంగా జరిపిస్తున్నారు కూడా ! వాళ్ల ఫ్యామిలీ గురించి వాళ్లు మాట్లాడుకున్నారే తప్ప.. అనిల్ గురించి ఒక్క మాట కూడా ప్రస్తావనకు రాలేదు. దీంతో అయ్యో అనిల్ అంటూ.. జాలిపడుతూ మెసేజ్‌లు పెట్టే వాళ్లు కొందరయితే.. ముఖేష్ అలాంటివాడు కాదు.. తమ్ముడిని బాగానే చూసుకుంటాడు అని అంటున్నవాళ్లు ఇంకొందరు.
అనిల్, ముకేశ్ మధ్య గతంలో వివాదాలు ఉండేవి. ఆస్తి చెరి సమంగా పంచుకున్నప్పటికీ.. అనిల్ అంబానీ సంపద మాత్రం కరిగిపోయింది. ఒకప్పుడు ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉండగా.. 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద సున్నా అని, దివాళా తీసినట్లు ప్రకటించారు. ఆస్తి పంపకాల తర్వాత ముకేశ్ అంబానీకి సంప్రదాయ ఆయిల్, గ్యాస్ బిజినెస్ వస్తే.. అనిల్ అంబానీకి ఆయన కోరుకున్న మంచి భవిష్యత్తు, వృద్ధి అంచనాలు ఉన్న టెలీ కమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ వంటివి దక్కాయ్. అయినా అనిల్ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో దివాళా తీశారు.
View this post on Instagram