Indian Women: ప్రియుడి కోసం భర్తను వదిలేసి.. పాకిస్తాన్ చెక్కేసిన మహిళ..
ప్రేమలు కూడా ఆన్‌లైన్ అయిపోయాయ్ ఇప్పుడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. చివరికి పబ్‌జీ పరిచయాలు కూడా ప్రేమగా మారుతున్నాయ్. ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. అన్ని రకాలుగా అవిటిది అని జోకులు వేస్తున్నారు చాలామంది.

Anju from Rajasthan goes to Pakistan to meet her pub ji lover Nasrul
పబ్‌జీలో పరిచయం అయిన ప్రేమికుడి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన మహిళ ఘటన మర్చిపోక ముందే.. అలాంటిది మరోటి జరిగింది. ఐతే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్ కాదు.. ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లారు ఓ మహిళ.
రాజస్థాన్‌కు చెందిన ఓ వివాహిత.. తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్లింది. అల్వార్ జిల్లాలోని బీవాడీకి చెందిన అంజుకు.. అరవింద్‌తో పెళ్లి అయింది. అంజుకు ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతన్ని కలుసుకోవడానికి అంజు.. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని అప్పర్ దిర్ జిల్లాకు వెళ్లింది. స్థానిక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సరిగ్గా ఉండటంతో.. ఆమెను విడిచిపెట్టారు.
ఐతే జైపూర్ వెళ్తున్నానని భర్తకు చెప్పి పాకిస్తాన్ వెళ్లిపోయింది అంజు. అసలు విషయం తెలిసి ఆమె భర్త అర్వింద్ షాక్ అయ్యాడు. అంజు పని చేసే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా వాట్సాప్ కాల్ చేయగా పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉన్నట్లు తెలిపింది. అంజూ తనకు మాట ఇచ్చిందని, పిల్లల కోసం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నాడు. సీమా హైదర్‌కు, అంజుకు తేడా ఏంటంటే.. ఆమె అక్రమంగా వచ్చింది.. అంజు లీగల్‌గా వెళ్లింది అంతే ! ఈ అర్థం లేని ప్రేమ మాత్రం సేమ్ టు సేమ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.