Ankura Hospital Fire Accident : అంకుర హాస్పిటల్ లో అగ్నిప్రమాదం… అందరూ సురక్షితం !
హైదరాబాద్ అంకుర హాస్పిటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను చల్లార్చారు. పేషెంట్స్ అందరూ సురక్షితంగా బయటపడ్డారు

Ankura Hospital Fire Accident: హైదరాబాద్ గుడిమల్కాపూర్ లోని అంకుర హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అదుపులోకి వచ్చాయి. పేషెంట్స్ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఐదో ఫ్లోర్ లో మొదలైన మంటలు పదో ఫ్లోర్ దాకా విస్తరించాయి. హాస్పిటల్ నేమ్ బోర్డుకు మంటలు అంటుకోవడంతో…. పక్కనే ఉన్న ఫ్లెక్సీల నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పదో ఫ్లోర్ లో భారీగా ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటంతో అక్కడ మంటల తీవ్రత ఎక్కువగా కనిపించింది. మంటలు చెలరేగగానే కొందరు పేషెంట్లను అంకుర హాస్పిటల్ సిబ్బంది కిందకు తీసుకొచ్చారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులతో పాటు చుట్టుపక్కల షాపుల్లో ఉన్నవాళ్ళంతా వచ్చి… పేషెంట్లను కిందికి తీసుకురావడంలో సాయపడ్డారు. దాంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదుని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే నాలుగు ఫైర్ ఇంజిన్లు చేరుకొని మంటలను ఆర్పాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది