బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపడానికి బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో ఉందా...? సల్మాన్ ను వై కేటగిరి సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏమీ కాపడలేవా...? లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నా సల్మాన్ ఖాన్ కు డెత్ డేట్ ఫిక్స్ అయిపోయిందా...? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్‌ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ లిస్టు లో చేర్చిన తర్వాత అతన్ని పట్టిస్తే 10 లక్షలు ఇస్తామని ప్రకటన చేసింది. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య వెనుక అన్మోల్ ఉన్నాడు. అలాగే ఏప్రిల్‌లో బాంద్రాలోని నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు ఘటన వెనుక... దసరా రోజున మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య సహా అనేక కేసులలో అతని పేరు బయటపడింది. పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందిన అన్మోల్ బిష్ణోయ్‌పై 2022లో ఎన్ఐఏ నమోదు చేసిన రెండు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసారు. గత ఏడాది ఫేక్ పాస్పోర్ట్ తో ఇండియా నుంచి పారిపోయి కెనడాలో ఉంటున్నాడు. అన్మోల్‌పై కనీసం 18 కేసులు ఉన్నాయి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. జూన్ 29, 2022న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా అనే గ్రామంలో సిద్దు మూసేవాలాను హత్య చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపిన వ్యక్తులకు ఆయుధాలు, అలాగే వారి ప్రయాణ ఏర్పాట్లను అన్మోల్ చూసుకున్నాడు. అకాలీదళ్ నాయకుడు విక్కీ ముద్దుఖేరా హత్యకు ప్రతీకారం కోసమే ఈ హత్య జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే సల్మాన్ ఖాన్ నివాసం, బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల జరిగిన కాల్పులకు సంబంధించిన కేసులో కూడా అన్మోల్ బిష్ణోయ్ పేరు ఉంది. ఏప్రిల్ 14న జరిగిన కాల్పులకు ముందు, బిష్ణోయ్ తన షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్ లో స్ఫూర్తి నింపడానికి 9 నిమిషాలు స్పీచ్ ఇచ్చాడని గుర్తించారు. వాళ్ళకు చరిత్ర సృష్టించాలని అన్మోల్ చెప్పినట్టు అధికారులు చార్జ్ షీట్ లో ప్రస్తావించారు. రాముడు మనల్ని ఆశీర్వదించాడు. మనం సల్మాన్ ను చంపేస్తాం... అందులో నో డౌట్... ఇది మొత్తం నా కంట్రోల్ లో ఉంది. ఈ విషయంలో నాకు ఏ ప్రాబ్లం గాని డౌట్ గాని లేదు అంటూ ఆ ఇద్దరికీ చెప్పాడు. ఇప్పుడు డూ ఆర్ డై అనేది.. భగవంతుడు రాసాడు. పొద్దున్నే బుల్లెట్లు పేల్చుకుంటాం, లేదంటే ఇంట్లో కూర్చుంటాం.. ఏం చేయాలో, ఏం చేయకూడదో మీ చేతుల్లోనే ఉంది.. మీరు సల్మాన్ ను చంపితే న్యూస్ పేపర్స్ లో మీ పేర్లు ఉంటాయి అంటూ వాళ్లకు మోటివేషన్ ఇచ్చాడు అన్మోల్. ఇప్పటికే సల్మాన్ ప్రాణ భయంతో వణికిపోతున్న టైం లో ఈ న్యూస్ మరింత భయాన్ని పెంచింది.