మరో క్రికెటర్ పెళ్ళి పెటాకులు, విడాకుల బాటలో మనీశ్ పాండే ?
గత కొంతకాలంగా సెలబ్రిటీల పెళ్ళిళ్ళలో చాలా వరకూ పెటాకులవుతున్నాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీనే కాదు క్రికెటర్లకు ఇది సర్వసాధారణంగా మారింది.
గత కొంతకాలంగా సెలబ్రిటీల పెళ్ళిళ్ళలో చాలా వరకూ పెటాకులవుతున్నాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీనే కాదు క్రికెటర్లకు ఇది సర్వసాధారణంగా మారింది. గత ఏడాది హార్థిక్ పాండ్యా, షమీ, శిఖర్ ధావన్ వంటి స్టార్ క్రికెటర్లు తమ తమ వ్యక్తిగత జీవితాలతో వార్తల్లో నిలిచారు. నిన్నటి వరకూ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కూడా విడాకుల వార్తలతోనే హాట్ టాపిక్ గా మారాడు. అయితే వీరంతా ముందు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారానో, తమ భార్యను అన్ ఫాలో చేయడం ద్వారానో హింట్ ఇస్తున్నారు. చాహల్, ధనశ్రీ ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతోనే డివోర్స్ రుమార్స్ మొదలయ్యాయి. తాజాగా మరో క్రికెటర్ మనీశ్ పాండే కూడా విడాకుల బాటలోనే నడుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మనీష్ పాండే – అతని భార్య అశ్రిత శెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ సోషల్ మీడియా వేదిక ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. మొదట ఆశ్రిత తన సోషల్ మీడియాలో మనీష్ పాండే ఫోటోలను తీసేస్తే. తాజాగా మనీష్ పాండే కూడా అదే పని చేస్తూ అన్ ఫాలో చేశాడు. దీంతో వీరిద్దరి రిలేషన్ షిప్ చెడిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే విడాకుల విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మనీశ్ పాండే, అశ్రిత 2019లో వివాహం చేసుకున్నారు. అశ్రిత తమిళ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంట్రీ ఇచ్చింది.
గత కొన్నేళ్లుగా బాగానే కలిసున్న వీరి జంట మధ్య ఇటీవలే మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ కి చెందిన మనీష్ పాండే 2015లో భారత జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు. టీమిండియా తరఫున తన కెరీర్ లో 29 వన్డేలు, 39 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడాడు.మనీశ్ పాండే జాతీయ జట్టు తరపున ఎక్కువ అవకాశాలు రాకున్నా ఐపీఎల్ లో మాత్రం అద్భుతమైన రికార్డుంది. 172 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మనీష్ పాండే.. 3850 పరుగులు చేశాడు.