China : చైనా నుంచి మరో వ్యాధి వ్యాప్తి..

అది 2019 డిసెంబర్‌ నెల. చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో ఉండే ఓ వ్యక్తిలో ఓ వైరస్‌ను గుర్తించారు డాక్టర్లు. వాళ్లకప్పుడు తెలియదు.. అది ప్రపంచాన్ని లాక్‌ చేసేంత ప్రమాదకారి అని. హుబేయి ప్రావిన్స్‌ నుంచి వ్యాపించడం మొదలైన ఆ వైరస్‌.. కొన్ని రోజుల్లోనే దేశాలు దాటింది. ప్రపంచాన్ని చుట్టేసింది. రెండు నెలలు.. రెండంటే రెడు నెలల్లో ప్రపంచాన్ని లాక్‌ చేసేసింది. అదే కరోనా వైరస్‌. చైనా నుంచి వ్యాపించిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 25, 2023 | 11:25 AMLast Updated on: Nov 25, 2023 | 11:25 AM

Another Disease Spread From China

అది 2019 డిసెంబర్‌ నెల. చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో ఉండే ఓ వ్యక్తిలో ఓ వైరస్‌ను గుర్తించారు డాక్టర్లు. వాళ్లకప్పుడు తెలియదు.. అది ప్రపంచాన్ని లాక్‌ చేసేంత ప్రమాదకారి అని. హుబేయి ప్రావిన్స్‌ నుంచి వ్యాపించడం మొదలైన ఆ వైరస్‌.. కొన్ని రోజుల్లోనే దేశాలు దాటింది. ప్రపంచాన్ని చుట్టేసింది. రెండు నెలలు.. రెండంటే రెడు నెలల్లో ప్రపంచాన్ని లాక్‌ చేసేసింది. అదే కరోనా వైరస్‌. చైనా నుంచి వ్యాపించిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కొన్ని లక్షల ప్రాణాలను మింగేసింది. కోట్ల కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇప్పుడు అదే చైనా నుంచి మరో వ్యాధి వ్యాపిస్తుండటం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. చైనాలో రోజు రోజుకూ పెరుగుతున్న ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెన్జా అనే న్యుమోనియా కేసులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.

దీనివల్ల ముఖ్యంగా చిన్నారుల్లో రెస్పిరేటరీ సమస్యలు చాలా వస్తున్నాయి. రోజు రోజుకూ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో ఈ విషయంపై స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది. అయితే ఇది ఏమంత ప్రమాదకారి కాదని చెప్తోంది చైనా దేశం. సీజన్‌ వ్యాధుల్లానే ఈ వ్యాధి కూడా వ్యాపిస్తోందని చెప్పింది. ముఖ్యంగా చిన్నారుల్లోనే ఈ న్యుమోనియా వ్యాప్తి అధికంగా ఉందని.. ఆ కారణంగానే ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్టు చెప్పింది. దేశంలో వ్యాధి తీవ్రత, వ్యాప్తికి సంబంధించిన పూర్తి వివరాలను వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు అందించింది చైనా. చైనాలో ఈ న్యుమోనియా వ్యాప్తితో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫేస్‌ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. చైనాలో ఉన్న పరిస్థితులను, చిన్నారులపై వ్యాధి ప్రభావాన్ని భారత ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి చైనా వెళ్లేవాళ్లకు ఎలాంటి గైడ్‌లైన్స్‌ పెట్టడంలేదని.. వ్యాధి తీవ్రతను బట్టి త్వరలో ఆలోచిస్తామని తెలిపింది. కానీ ఈ న్యుమోనియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.