Mega Family: మెగా ఇంట్లో మరో విడాకులు !?
మెగా ఫ్యామిలీలో మరో జంట విడాకులు తీసుకున్నారా. చిరంజీవి కూతురు శ్రీజకు ఆమె భర్తకు మధ్య కోలుకోలేని గ్యాప్ పెరిగిందా. అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Another divorce matter has come to light in the mega family. There are reports that the distance between Sreeja and Kalyan Dev has increased
శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ సోషల్ మీడియాలో పెడుతున్న కొన్ని పోస్ట్‌లు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. శ్రీజను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హీరో కళ్యాణ్ దేవ్. కానీ పెద్దగా హిట్స్ అందుకోలేకపోయాడు. చిరంజీవి అల్లుడిగానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. చాలా కాలం నుంచి దూరంగానే ఉంటున్న శ్రీజ కళ్యాణ్ ఇప్పుడు అధికారికంగా విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది శ్రీజ తన పేరు చివర కళ్యాణ్ పేరు తొలగించి పుట్టింటి పేరు పెట్టుకుంది. ఇక కొద్ది రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో కళ్యాణ్ దేవ్ పెట్టే పోస్ట్‌లు వీళ్లు అధికారికంగా విడాకులు తీసుకున్నారా అనే అనుమానాలకు తావిస్తున్నాయి.
రీసెంట్‌గా ఫాదర్స్ డే సదర్భంగా తన కూతురితో కలిసి ఉన్న ఫొటో, వీడియో షేర్ చేశాడు కళ్యాన్. చాలా గ్యాప్ తరువాత తన కూతుళ్లను కలిసే చాన్స్ తనకు దొరికిందంటూ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు రీసెంట్‌గా మరో ఫొటో అప్‌లోడ్ చేసి ఎమోషనల్ కొటేషన్ రాశాడు. జీవితంలో మనం మార్చలేనివి ఉన్నప్పుడు వాటిని వదిలేయాలి. అప్పుడే అవి మనకు మధుర క్షణాలుగా మారతాయి. నాతో అంగీకరిస్తారా అంటూ పోస్ట్ చేశాడు. కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. శ్రీజను ఉద్దేశించే కళ్యాణ్ ఈ పోస్ట్ చేశాడని అంతా అనుకుంటున్నారు. విడాకులు తీసుకున్నారా అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.